publisherpro

నారప్ప సినిమా నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు | Narappa movie Review | Telegu movies

నారప్ప  సినిమా నుండి మనం నేర్చుకోవాల్సిన  విషయాలు

narappa_movie

                 మనందరం తరచూ సినిమాలు చూస్తూ ఉంటాం. మనం సినిమాలెందుకు చూస్తాం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం, సరదా కోసం మరియు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త రిలీఫ్ కోసం చూస్తుంటాం. సినిమా అనేది మన జీవిత శైలి లో ఒక భాగమైపోయింది. ఇంకా అసలు విషయానికొస్తే ప్రతి సినిమాలో మంచి ఉంటుంది, చెడు రెండు ఉంటాయి. మనం సినిమా నుండి దేనిని గ్రహించాం అన్నది ముఖ్యం. సినిమా హిట్టు లేదా ఫ్లాప్ పక్కన పెడితే ఆ సినిమాలో కొన్ని మంచి విషయాలు ఉంటాయి. వాటి నుండి మనం నేర్చుకో గలగాలి. ఆ సినిమా దర్శకుడు మరియు రచయిత మనకు ఏం చెప్పదలుచుకున్నడో మనం గ్రహించగలగాలి.

                         ఈ మధ్యనే రిలీజ్ అయిన నారప్ప సినిమా విషయానికొస్తే, నారప్ప సినిమా రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాలో వెంకటేష్ తన అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మిగతా పాత్రధారులు కూడా తమ నటనతో ఔరా అనిపించారు. ఇంకా ఈ సినిమాలో మనం మంచి విషయాల గురించి చూస్తే ఈ సినిమాలో ముఖ్యంగా ఐదు ప్రధాన పాత్రలు గలవు. ఒక్కో పాత్ర ఒక్కో విషయాన్ని మనకు నేర్పుతుంది. ఈ సినిమాలో నటించిన పాత్రధారులు కూడా జీవించారని చెప్పాలి.

నారప్ప సినిమాలో ప్రధాన పాత్రలు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు

నారప్ప(వెంకటేష్):

ఈ సినిమాలో ప్రధాన కథా నాయకుడు పాత్ర నారప్ప. నారప్ప పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారు. నారప్ప పాత్ర నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా తన కుటుంబం పై ఉన్న ప్రేమ, బాధ్యత మనకు చాలా నేర్పిస్తుంది. నారప్ప పోలీస్ స్టేషన్ లో ఉన్న తన పెద్ద కొడుకు ను విడిపించడానికి ఊర్లో వాళ్ళందరూ కాళ్ళ మీద పడతాడు. దీనిబట్టి అర్థమవుతుంది. నారప్ప కు తన కుటుంబం మీద కొడుకు ఎంత ప్రేమో అని . నారప్ప తలుచుకుంటే తన కొడుకును చంపిన వారందరినీ అప్పుడే చంపగలడు. గతంలో తాను కుటుంబం పోగొట్టుకున్న విషయం గుర్తుకు వచ్చి మళ్లీ తన కుటుంబాన్ని ఇబ్బందులు పడకూడదని, బాధను దిగమింగి కుటుంబం కోసం చేతకాని వాడిలా ఉంటాడు. చిన్న కొడుకు హత్య చేసినప్పుడు చిన్న కొడుకుని కుటుంబాన్ని కాపాడుకోవడానికి నారప్ప చేసిన పోరాటం మరియు తన కొడుకు కోసం జైలుకు వెళ్ళటం చూస్తే మనకు అర్థమవుతుంది. నారప్ప కు కుటుంబం మీద ఉన్న ప్రేమ,బాధ్యత. మొత్తం మీద నారప్ప పాత్ర వల్ల ఓ తండ్రి కుటుంబం కోసం ఏం చేయడానికైనా ఎంత త్యాగానికైనా సిద్ధం అని మనం తెలుసుకోవాలి.ముఖ్యం గా నారప్ప పాత్ర వల్ల ఒక తండ్రి కుటుంబం కోసం దేనికోసమైన సిద్ధం అని తెలుస్తుంది.

సుందరమ్మ (ప్రియమణి ):

ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర నారప్ప భార్య సుందరమ్మ. సుందరమ్మ పాత్రలో ప్రియమణి అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో పాత్ర అన్యాయాన్ని ఎదిరించే పాత్ర అందువల్లే పెద్ద కొడుకుని ఆపకుండా ప్రోత్సహించింది. అన్యాయాన్ని ఎదిరించడం అనేది మంచిదే కానీ ఎదిరించిన తర్వాత తరువాత వచ్చే పరిణామాల ను ఊహించి జాగ్రత్తపడాలి. ఈ విషయంలో సుందరమ్మ అలా ఊహించ కుండా కొడుకుని ఆపకుండా ప్రోత్సహించింది. దీని వల్ల కొడుకు చావుకు పరోక్ష కారణం అయింది. పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత కూడా సుందరమ్మ కుటుంబం గురించి పట్టించుకోకుండా బాధతో ఉండిపోయింది. అది చూసిన చిన్న కొడుకు హత్య చేయడానికి కూడా ఆలోచించలేదు. దీనివల్ల నారప్ప కుటుంబం మొత్తం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సుందరమ్మ కుటుంబాన్ని చక్కగా పట్టించుకుంటే విషయం ఇంత వరకు వచ్చేది కాదు. ఈ సినిమాలో సుందరమ్మ పాత్ర బట్టి కుటుంబంలో సంతోషానికి నా కష్టాల కైనా ఇల్లాలి పాత్ర ముఖ్యం.

మునికన్నా :

narappa_movie


మునికన్నా నారప్ప పెద్దకొడుకు . మునికన్నది అన్యాయాన్ని ఎదిరించే మరియు తండ్రిని అవమానిస్తే ఎంతటివారైనా బుద్ధిచెప్పే పాత్ర. ధైర్యసాహసాలు ఉన్నాయి కానీ ఆ పని చేయడం వల్ల తర్వాత వచ్చే దుష్ఫలితాలు ముందుగా ఊహించలేకపోయాడు. తండ్రిని అవమానించాడని సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడైనా పండు స్వామిని చెప్పుతో కొడతాడు. కానీ తన పంట చుట్టూ కరెంటు తీగలు చుట్టిన పండు స్వామి తను ని చెప్పుతో కొట్టిన వారిని ఏమి చేయకుండా ఉంటాడని అనుకున్నాడు. ఈ ముని కన్న నుండి ధైర్యసాహసాలతో పాటు ఆలోచించి ముందు చూపు కూడా ఉండాలి అని తెలుసుకోవలి.లేకపోతె ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.

చినప్ప ;

నారప్ప చిన్న కొడుకు అయిన చిన్నప్ప . నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర చిన్నప్ప. ధైర్యసాహసాలతో కూడిన ఒక కుర్రాడు చిన్నప్ప. చిన్నప్ప కు తన తల్లి అన్న మరియు తన అన్నయ్య అన్న ఎంతో ప్రేమ, అభిమానం. తన అన్నయ్య చనిపోయిన తర్వాత తన తల్లి యొక్క బాధని చూడ  లేక, తన అన్నయ్య ని చంపిన వారిని చంపాలని పగతో చిన్నతనంలోనే పండు స్వామిని హత్య చేశాడు. దాని వల్ల కుటుంబం మొత్తం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తండ్రి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీన్నిబట్టి ప్రేమతో గాని పగ తో గాని ఆలోచించకుండా ఎలాంటి తప్పులు చేయకూడదు. ముఖ్యంగా వయసు నుంచి మించినవి. ఈ సినిమాలో చినప్పకు తండ్రి నారప్ప అంటే చిన్న చూపు, తండ్రిని తక్కువ అంచనా వేస్తూ ఒక తాగుబోతు ల చూస్తాడు. కానీ తర్వాత తండ్రి కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటాన్ని చూసి తండ్రి గురించి తెలుసుకుంటాడు. దీన్నిబట్టి  తండ్రి ఎందుకు అలా చేయవలసి ఉందో ఆలోచించాలి. ప్రస్తుత పరిస్థితి చూసి ఎప్పుడు తండ్రి చిన్నచూపు చూడకూడదు.

బసవయ్య:

                  ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర. ఈ సినిమాలో బసవయ్య సుందరమ్మ అన్న గా రాజీవ్ కనకాల మెప్పించాడు. బసవయ్య పాత్ర నుండి మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ముందుగా తన కుటుంబాన్ని మొత్తం కోల్పోయి వచ్చిన నారప్ప కు ఆశ్రయం ఇవ్వడం, వ్యవసాయం నేర్పించి తన కాళ్ళమీద నిలబడేలా చేయడం. దీన్నిబట్టి బసవయ్య యొక్క సాయం చేసే గుణం , కష్టాల్లో ఉన్నవారికి ఆదుకునే లక్షణం నేర్చుకోవాలి. నారప్ప కు తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేసి ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటాడు. దీనిబట్టి చెల్లెలిపై అన్నకు ఉండవలసిన బాధ్యత, ప్రేమ గురించి మనం నేర్చుకోవాలి.

narappa_movie

                        మొత్తం మీద నారప్ప సినిమా తెలుగులో ఒక మంచి విజయం దక్కించుకుంది. ఈ సినిమా కుటుంబం మొత్తం చూడొచ్చు. నారప్ప సినిమాలో ముఖ్యంగా ఊహించని ఆపద వచ్చినప్పుడు కుటుంబాన్ని నారప్ప ఎలా కాపాడుకున్నాడు అనేద విషయం. మీరు ఇంకా ఈ సినిమా చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో ఉంది చూసేయండి.




THANK YOU






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు