లవ్ స్టోరీ ఎలా ఉందంటే ...
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో ఫిదా దర్శకుడు శేఖర్ కమ్మల దర్శకత్వంలో ఈరోజు విడుదల అయినా లవ్ స్టొరీ మూవీ మంచి positive టాక్ ని సొంతం చేస్కుంది.
ఈ చిత్రం మొదటి నుండి మంచి అంచనాలు తో రూపుదిద్దుకుంది. సారంగా దరియ పాటకు మంచి ఆదరణ లభించింది. తరవాత విడుదల అయిన పాటలు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి.
చై, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల ఈ ముగ్గురు క్రేజీ కలయిక పై సినీ ప్రేక్షకులకు బారి అంచనాలు పెట్టుకున్నారు. ఎప్రిల్ లో విడుదల అవ్వవలసిన సినిమా కరోనా సెకండ్ వేవ్ వలన ఈరోజు విడుదల అయింది.
ప్రధానాంశాలు :
లవ్ స్టొరీ సినిమా విషయానికి వస్తే సినిమా ప్రదానంగా ఈ రోజుల్లో కూడా కులం కారణంగా బలౌతున్న ప్రేమ జంట లు, తక్కువ కులం లో పుట్టి ఇప్పటికీ అడుగడుగునా హేళనలు ఎదుర్కుంటు పైకి రావాలి అని కోరుకునే యువకుడు ,వావి వరుస చిన్న పెద్ద లేకుండా కామాంధుడు వలన కష్టపడ్డ అమ్మాయి జీవితం మనకు కనిపించే ప్రధానాంశంగా రూపొందించారు.
నటన :
నటన మరియు నటి,నటులు విషయానికొస్తే నాగ చైతన్య మరియు సాయి పల్లవి నటనతొ సినిమా ను ఇంకొ లెవెల్ కు తీసుకెళ్లారు. వీళ్లిద్దరి మధ్య సన్నీ వేషాలు మనసుకి హత్తుకున్నాయ. ఇంకా రాజీవ్ కనకాల విలన్ గా తన రాక్షస రూపాన్ని చూపించి సూపర్ అనిపించాడు. తర్వాత నటి నటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు
సినిమా ఎలా ఉందంటే :
సినిమా చూడటానికి ఇంట్రెస్టింగా ఉంటుంది. మ్యూజిక్ మరియు పాటలు బాగున్నాయి. నటన బాగున్నా కానీ శేఖర్ కమ్ముల తన శైలీ ని చూపించ లేదు. సినిమా confused గా ఉంటుంది. క్లమాక్స్ నిరాశ కలిగిస్తుంది. సినిమా బాగుంది అనిపించినా అంచనాలు అందుకోలేదు అని చెప్పవచ్చు.
మనం నేర్చుకోవలసినవి :
- రేవంత్ అనే యువకుడు ఎలా అయినా తనకు తెలిసిన విద్యా తో బిసినెస్ చేసి, పైకి రావాలి తన తల్లిని బాగా చూస్కో వాలి అనే పట్టుదల.
- తన బాబాయ్ వల్ల మోసపోయిన తన కుటుంబం ని, తను ఉద్యోగం చేసి బాగా చూసుకోవాలి అని పట్నం బాట పట్టిన యువతి యొక్క కషీ,పట్టుదల.
- భర్త పోయిన తన రెక్కలా కష్టం తో కొడుకుని పోషిస్తు , తన పొలాన్ని తిరిగి పొందిన తల్లి యొక్క ధైర్యం, తెగువ.
ప్లస్ :
నటీనటులు నటన
మ్యూజిక్
మైనస్ :
క్లైమాక్స్
Confusing స్టొరీ
మా యొక్క రేటింగ్ :
3/5
0 కామెంట్‌లు