రిపబ్లిక్ మనకు ఎం నేర్పిస్తుంది
టాలీవుడ్ సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ నటించిన Republic సినిమా ఈరోజు విడుదలయి ప్రేక్షకులా ముందుకు వచ్చింది. సినిమా ట్రైలర్ మంచి ఆసక్తికరంగా రాజకీయనేపథ్యంలో సాగె లా ఉంది. ఇందులో సాయిధర్మతేజ్ IAS లా కనిపించనున్నాడు. మనందరికీ తెలిసిందే ధర్మతేజ్ ఈ మద్యనే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కానీ తన కోరిక మేరకు ఈరోజు రిపబ్లిక్ సినిమా మన ముందుకు వచ్చింది.ఈ సినిమా ప్రి రిలీజ్ కి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ ముఖ్య అతిథిగా వచ్చి పవర్ ఫుల్ గా మాట్లాడిన నేపథ్యంలో సినిమా ట్రయిలర్ కూడా పొలిటికల్ నేపథ్యంలో ఉంటడం వలన సినిమా అంచనాలు పెరిగాయి.
సినిమా కథ
రిపబ్లిక్ సినిమా విషయానికొస్తే అభి(సాయి ధర్మతేజ్) పిల్లాడు చిన్నతనం నుండి బాగా తెలివైన కుర్రవాడు. తన తెలివితేటలతో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాడు. పెద్దయ్యాక అమెరికాలో చదువు కొనసాగిస్తూ వివిద పరీక్షలు రాస్తాడు. పోలింగ్ బూత్ లో తన ఓటు రిగ్ అయిందని తెలుసుకొని అధికారులు ని నిలదీస్తుండటంతో ఆ జిల్లాలో కలెక్టర్ తో జరిగినా సంభాషణ వల్ల అమెరికా వేళ్ళ కుండా కలెక్టర్ అవుతాడు.ఇంకో వైపు అనేక అవినీతి లు చేసి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశాఖ వాని (రమ్యకృష్ణ)తన అవినీతి, దారుణాలు ఇంకా పెంచుతుంది. వీళ్లిద్దరి మధ్య పోరాటం ఎలా ఉంటుంది. విశాఖ వాని పై అభి గెలుస్తాడ? గెలిచి న తరువాత ప్రజలు మారతారా? లేదా అన్నాది కథ.
నటన
ఈ చిత్రాన్ని సాయి ధర్మతేజ్ చాలా ప్రత్యేకంగా తీసుకుని నటించారు. హీరోయిన్ నిడివి చాలా తక్కువ గా ఉంటుంది. విశాఖ వాని పాత్రలో రమ్యకృష్ణ శివగామి పాత్ర లాగా నటనతో తన పవర్ చూపించారు. తండ్రి పాత్రలో జగపతిబాబు తన నటన యెక్క సహజత్వం చూపించారు. ఈ సినిమాలో మెయిన్ పిల్లర్స్ సాయి ధర్మతేజ్ మరియు రమ్యకృష్ణ.
ప్రధానాంశాలు
ప్రస్తుత వ్యవస్థ ఎలావుందీ అనే తరహాలో సినిమా ఉంటుంది. రాజకీయ నాయకులు ఎలా తన అవసరాలకు తగ్గట్టు పార్టీలు మారి అధికారంలోకి వస్తూన్నారు. తమ అధికారాన్ని ఉపయోగించి ఎలా అధికారుల తో పనులు చేయించి కుంటున్నారో, ప్రస్తుతం ప్రజాస్వామ్య లో ఏలాంటి అవినీతి లు దారుణాలు జరిగుతున్నాయి వాటిని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు, ప్రజలు ఎలా కులా,మత లకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేయడం కోసం దర్శకుడు ప్రయత్నించాడు.
డైలాగ్ లు :
మీ భయం, ఆజ్ఞము, విశ్వాసం,అమాయకత్వం ఆ సింహాసం కి నాలుగు కాళ్ళు.
ఒక్కసారి భయం అనే కట్టెలు తెంచుకుని చూడండి. ఆ సింహాసనం కాళ్ళు విరుగుతాయి. ఈ తల్లి సంకెళ్లు తెగుతాయి.
ఎలా వుంది
చివరిగా ఈ సినిమా ఎలా ఉంది అంటే ప్రేక్షకులకు కొద్దిగా నిరాశ పరుస్తోంది. సినిమాల్లో కామెడి లేకపోవడం, హీరోయిన్ కి అంత ప్రాధాన్యత లేకపోవడం, సినిమా మొత్తం వ్యవస్థ వైఫల్యాలను ను చూపటం, చివరకు మంచి చేసిన హీరో ప్రజలు చేత హత్య చేయబడటం. ఈ విధంగా రిపబ్లిక్ అంచనాలు కు అందుకోలేదు.
ప్లస్ :
డైలాగ్ లు
నటన
మైనస్ :
క్లయిమాక్స్
కామెడి లేదు
పాటలు
Telugu center review 2/5
రిపబ్లిక్ మనకు ఎం నేర్పిస్తుంది :
ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఎలా వుంది , ప్రభుత్వం ప్రజల గురించి ఎలా ఆలోచిస్తుంది. ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు
0 కామెంట్‌లు