HAIR FALL NATURAL TIPS IN TELUGU
జుత్తు రాలకుండా , పోయిన జుత్తు తిరిగి పొందాలి అంటే
మగవారికైనా ,ఆడ వారి కైనా జుత్తు రాలటం అనేది చాల పెద్ద సమస్య ఎందుకు అంటే మగవారికైనా ,ఆడ వారి కైనా జుత్తు ఉంటేనే అందం,ఆకర్షణీయం.అలాంటి జుత్తు రాలుతుంది అంటే మనం జాగ్రత్త పడాల్సిన విషయం. జుట్టుని మనం చాల జాగ్రత్త చూసుకోవాలి. జుత్తు కొన్ని కారణాలు వలన రాలటం మొదలవుతుంది.కొంత వయస్సు వచ్చిన తరవాత జుత్తు రాలటం మొదలవుతుంది.అప్పుడు కంగారు పడకుండా జుట్టు రాలుటకు గల ప్రధాన కారణాలు తెలుసుకుని క్రింది మూడు విషయాలు పాటిస్తే చాలు జుట్టు రాలటం తగ్గి క్రొత్త జుట్టు వస్తుంది.
- సరైన పోషక ఆహారం
- ప్రతి రోజు వ్యాయామం (ప్రత్యేకంగా జుత్తు రాలకుండా చేసేవి )
- సరైన మన వంటింటి చిట్కాలు
సరైన పోషక ఆహారం
సరైన పోషకాహారం మనం తినక పోవటం వలన మనకు చాల నష్టాలు ఉన్నాయ్ అందులో హెయిర్ ఫాల్ ఒకటి. పోషకాహార లోపం వలన జుట్టు కి అందవలసిన పోషకాలు అందక జుట్టు బలహీనంగా తయారయి రాలటం మొదలవుతుంది.కాబట్టి మనం సరైన పోషక ఆహారం తీసుకుని మన జుత్తు రాలకుండా మరియు ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి.
మన శరీరం లో వేగంగా అభివృద్ధి చెందే కణాలలో మన జుట్టు కణాలు ఒకటి.వాటికీ పోషకాలు అందకపొతే అవి బలహీనం అవుతాయి. జుట్టు కి కావలసిన ప్రధాన పోషకాలు ఐరన్ ,విటమిన్ బి 7,విటమిన్ బి 12,విటమిన్ C ,విటమిన్ డి , జింక్ మొదలగునవి. ఈ పోషకాలు ప్రతి రోజు మనం తినే ఆహరం లో ఉండేలా చూసుకోవాలి.
మన శరీరిరం లో DHT హార్మోన్ స్థాయి పెరిగి పోవటం కూడా జుత్తు రాలుటకు ఒక ప్రధాన కారణం. DHT స్థాయి పెరగకుండా నిరోధించే ఆహారం తీసుకోవాలి.
- ఐరన్
- బయోటిన్
- విటమిన్ C
- విటమిన్ D
- జింక్
- DHT బ్లాకెర్స్
ఐరన్
ఐరన్ ఎర్ర రక్త కణాలుని కుదుళ్ళకి అందించడంలో తోడ్పడుతుంది.మన జుట్టు పెరుగు దలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. శరీరం లో అనేక విధులుని నిర్వర్ష్టిస్తుంది.
ఐరన్ లోపం వలన రక్త హీనత వస్తుంది.హెయిర్ లాస్ కు రక్త హీనత కూడా కారణం అవుతుంది. కాబట్టి తరచూ ఐరన్ ఉండే ఆహారం తీసుకుంటూ ఉండాలి.
విటమిన్ బి7(బయోటిన్ )
బి విటమిన్స్ ని BIOTIN అంటారు. బయోటిన్ హెయిర్ పెరుగుటకు చాల అవసరం. ఇది ఎర్ర రక్త కణాలు తయారీకి ఉపయోగ పడుతుంది. ఇది ఎర్ర రక్త కణాలుని మరియు పోషకాలుని జుట్టు కుదుళ్లకు అందిస్తుంది.
- తృణ ధాన్యాలు
- బాదం
- మటన్
- ఫిష్
- పెరుగు
- స్వీట్ పొటాటో etc ..
విటమిన్ సి
విటమిన్ సి లోపం వలన మన హెయిర్ సన్న బడుతుంది.విటమిన్ సి ఏంచేస్తుంది అంటే మన శరీరం లో ఐరన్ ని గ్రహించుకొని జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది.అంతే కాకుండా విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- నిమ్మ ,నారింజ వంటి పళ్ళు
- ఉసిరికాయ
- టమాటో
- పొటాటో
- ఆకుకూరలు
విటమిన్ డి
విటమిన్ డి జుట్టు యొక్క పెరుగుదల కు తోడ్పడుతుంది.విటమిన్ డి మనకు సూర్య కాంతి నుండి లభిస్తుంది .చాల మందికి విటమిన్ డి లోపం వలన కూడా హెయిర్ ఫాల్ అవుతుంది.
- పాలు
- పుట్టగొడుగు
- ఫిష్
- సూర్య రశ్మి
జింక్
జింక్ మన కుదుళ్ళు పెరుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. జుట్టు రాలటం లో జింక్ లోపం అనేది ఒక ముఖ్య కారణం.జింక్ ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు సరైన మోతాదులో తీసుకోవాలి.
లభించే ఆహార పదార్దాలు
- గుమ్మడి గింజలు
- మటన్
- గుడ్లు
- ఫిష్
- తృణ ధాన్యాలు
- కూరగాయలు
DHT
DHT అంటే డై హైడ్రో టెస్టోస్టీరాన్ ఇది టెస్టోస్టీరాన్ హార్మోన్ వలన ఉత్పాదన అవుతుంది.DHT హార్మోన్ ఎక్కువ అవటం వలన జుత్తు కుదుళ్ళు బలహీనం గా మారీ రాలటం మొదలవుతుంది.
నిరోధించే ఆహార పదార్దాలు
- గ్రీన్ టీ
- టమాటో
- పొటాటో
- కొబ్బరి నూనె
- ఉల్లి
- చిక్కుడు
సరైన మోతాదులో ప్రతిరోజూ పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన మనం ఆరోగ్యంగా ఉండటమేగాక మన జుట్టు రాలటం ఆగి మళ్ళి కొత్త జుత్తు తిరిగి పొందుతారు.
ప్రతి రోజు వ్యాయామం
ప్రత్యేకంగా హెయిర్ (జుత్తు ) ఆరోగ్యం కోసం వ్యాయామాలు (exercises )
జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు ఆరోగ్యం కొరకు మూడు చాల సులభం గ చేయగలిగిన కొన్ని ఆసనాలు ఉన్నాయ్.ఇవి మన ఇంట్లో చాల సులభంగా చేస్కోవచ్చు.మంచి ఫలితాలను కూడా పొందవచ్చును
హస్తపాదాసనం
తలకు మర్దన చేసుకోవటం
బాలయం
- బాలయం అనగా మన రెండు చేతి వేళ్ళ ఒకదానితో ఒకటి రుద్దుకోవటం.
- ఇలా చేయడం చాల సులభం.
- బాలయం చేయటం వలన హెయిర్ రాలటం త్వరితంగా తగ్గుతు.
- మన చేతి వెళ్లాలో ఉన్న నరాలు మన తలలో వరకు ఇలా రుద్దటం వలన కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
హస్తపాదాసనం
- హస్తపాదాసనం మనం ఇంట్లో సులభంగా చేస్కో వచ్చును.
- నిటారుగా చేతులు పైకి ఎత్తి ముందుకు వంగి తరవాత చేతులును మీ పాదాలు పక్కన ఉంచి మీ తలను మోకాలు కు తగిలేలా ఉంచాలి .
- హస్తపాదాసనం వలన మన ముఖ బాగంకి మరియు కుదుళ్ళకి రక్త ప్రసరణ జరిగి కుదుళ్ళు బలంగా తయారవుతాయి.
- రోజు క్రమం తప్పకుండ చేయటం వలన జుట్టు రాలటం తగ్గి, తిరిగి కొత్త జుట్టుని పొంద వచ్చును.
తలకు మర్దన చేసుకోవటం
- తలకు మంచి కొబ్బరి నూనె తో మర్దన చేసుకోవటం వలన చాల కుదుళ్లకు అందవలసిన రక్తం అందుంటుంది.
- కురులు ఆరోగ్యంగా దృడంగా తయారవుతాయి.
- జుట్టు రాలటం తగ్గుతుంది
- వారానికి ఒకటి రెండు సార్లు ఇలా చేసుకుంటే జుత్తు రాలటం సమస్యను వేగంగా అధిగమించ వచ్చును
మన వంటింటి చిట్కాలు
1. ఉసిరి పౌడర్ లో నిమ్మరసం కలిపి కుదుళ్లకు పట్టించి కొన్ని నిమిషాలు ఆలా ఉంచి తరవాత కడిగేయాలి. ఇలా చేస్తే తలలోని చుండ్రు, పేలు వంటి మలినాలు పోయి జుత్తు శుభ్రం గా ఉంటుంది. జుట్టు రాలటం తగ్గుతుంది . ఉసిరి లో కాల్షియమ్ ,నిమ్మ రసంలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగస్ గుణాలు జుట్టును మలిన రహితం గా , ధృడంగా చేస్తాయి.జుట్టు యొక్క పెరుగుదలకు తోడ్పడతాయి.
2. కలబంద (aloe Vera ) గుజ్జు ను తీసి చక్కగా కుదుళ్లకు మర్దన చేసి ఆలా 45 నిమిషాలు ఉంచి కడిగేయండి.దీని వలన జుట్టు రాలటం ఆగుతుంది. వారానికి రెండుసార్లు చేస్తే మంచిది.కలబంద లో గల విటమిన్ A , C జుట్టు యొక్క కుదుళ్ళు ను ఆరోగ్య వంతంగా చేస్తుంది.
3. కరివేపాకు ను కొబ్బరి నూనె తో పాటు బాగా మరిగించి , చల్లారిన తరవాత ఆ నూనెను జుట్టు కు రాసుకోవాలి, రాసుకున్న తరవాత ఒక గంట పాటు ఆలా ఉంచి షాంపూ తో కడిగేయాలి. ఇలా చేస్తే కొత్త జుట్టు వస్తుంది. కరివేపాకు జుట్టు యొక్క మృత కణలని తొలగిస్తుంది.
4.ఉల్లి రసం ని తీసుకొని అందులో మెంతులు పొడి ని కలిపి కుదుళ్ళు కు మర్దన చేసి 30 నిమిషాలు పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. దీని వలన జుట్టు వేగంగా పెరుగుతుంది. ఇలా వారానికి రెండు మాడు సార్లు చేయండి.
5. రోజు తెల్లవారి ఖాళీ కడుపుతో కొన్ని కరివేపాకులు తినటం వలన కూడా హెయిర్ పెరుగుదల పెంచవచ్చును.
వీలైనంత వరకు కెమికల్స్ ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ వాడకం తగ్గించడం మంచిది. జుట్టు కు తరచూ నూనె తో మసాజ్ చేసుకోవటం చాల మంచిది.మంచి కొబ్బరి నూనె తో మసాజ్ చేయటం ఇంకా మంచిది.ఇందులోని విటమిన్స్ , ఫ్యాటీ ఆమ్లాలు వల్ల జుట్టు వేగంగా పెరుగుదలకు, ధృడంగా మరియు పొడుగు చేస్తుంది.
0 కామెంట్‌లు