జుత్తు రాలటానికి బాయ్ బాయ్
ప్రస్తుత కాలం లో జుత్తు రాలటం అనే అనే సమస్యా సాధారణం అయిపోయింది. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా జుత్తు రాలటం సమస్య మనల్ని బాధిస్తుంది. మానసికంగా కూడా ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
జుత్తు రాలడం సమస్యా అన్ని వయస్సు లు వారికి ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా యుక్త వయస్సు లో ఉన్న స్త్రీ పురుషులు కు ఈ సమస్యా ఇంకాస్త ఎక్కువగా బాధిస్తుంది. ఎందుకంటే ఒక మంచి హెయిర్ స్టయిల్ ఉంటే మనలోని అందాన్ని మరియు ఆత్మవిశ్వాసం న్ని పెంచుతుంది.
ఈ జుత్తు రాలడం అనే సమస్య ప్రధానంగా ఎందు వల్ల రాలుతుంది. దీనిని ఎలా అరికట్టవచ్చు, మళ్ళీ కొత్త జుట్టు ని పొందటానికి గలా వంటింటి చిట్కాలు ను తెలుసుకుందాం.
జుత్తు రాలటానికి గలా ప్రధాన కారణాలు
- ఒత్తిడి
- చుండ్రు
- ఎక్కువగా కెమికల్స్ ఉన్న హెయిర్ ప్రోడక్ట్స్ వాడటం
- హెయిర్ డ్రైయర్ లు వంటివి వాడటం
- రక్తహీనత
- థైరాయిడ్ వంటి వాటివలన
- కాలుష్యం
- DHT పెరగడం
- వారసత్వం
ఒత్తిడి (STRESS)
జుత్తు రాలటనికి ప్రధాన కారణం. ఒత్తిడి,టెన్సన్ లు ఈమద్య కాలములో చిన్న నుండి పెద్ద వరకు అందరిలోనూ చాల ఎక్కువా అయిపోయావి. exams టెన్సన్, ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారం లో ఒత్తిడి మరియు యువకుల్లో ముఖ్యంగా ఉద్యోగం కోసం, ప్రేమ కోసం ఇలా అనేక టెన్షన్ల మద్య ఒత్తిడి పెరిగి జుత్తు రాలటం ప్రారంభం అవుతుంది. కావున ఒత్తిడి జయించి వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యండి. సమస్యలు గురించి అలోంచి ఒత్తిడి లోనుకాకుండా పరిష్కారం కోసం ఆలోంచించండి. ఒత్తిడి తగ్గించుకోటానికి ప్రయత్నిచండి.
గుర్తుంచుకోండి ఒత్తిడి, టెన్సన్ అనేవీ జుత్తు రాలటానికి ప్రధాన కారణం
ఒత్తిడి ( STRESS ) ఎలా తగ్గుతుంది :
ఒత్తిడి నుండి బయటపడి ప్రశాంత మైన జీవితాన్ని గడపాలి అంటే మనకు ముందుగా సరిఅయిన నిద్ర కావాలి.నిద్ర లేమి వలన స్ట్రెస్ రెట్టింపు అవుతుంది. రోజుకు 8 గంటల నిద్రపోవటం ఉత్తమం.
అతిగా ఆలోచించకండి అతిగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరిగిపోవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు.ప్రతి రోజు ధ్యానం(మెడిటేషన్) చేయడం.యోగ లేదా exercise చెయ్యటం.జంక్ ఫుడ్ దూరంగా ఉండటం.వీటి వలన ఒత్తిడి ని తగ్గించుకోవచ్చు.
చుండ్రు(Dandruff)
జుత్తు రాలటం అనేది ఈ చుండ్రు (DANDRUFF ) తో మొదలవుతుంది.దీని వలన జుత్తు యొక్క మొదలు భాగం బలహీనం అవుతుంది.చుండ్రు వలన చిరాకు గా కూడా ఉంటుంది. క్రమేపి జుత్తు ఊడిపోవటానికి దారితీస్తుంది.
చుండ్రు రావటానికి గల కారణాలు
చుండ్రు రావటానికి అనేక కారణాలు ఉన్నాయ్.
మనం మన తలా మీదనున్న జుత్తు ని సరిగా పట్టించుకోక పొతే చుండ్రు రావటానికి వేగంగా ఆస్కారం ఉంటాది.తల మీద నూనె రాసుకోక పోతే మన తలా మీద చర్మము పొడిబారితుంది దీనివలన చుండ్రు ఏర్పడుతుంది మరియు చర్మం జిడ్డు గా ఉంటడం,తలపై ఫంగస్ ఏర్పాటటం,నాజీ రకపు షాంపూ లు లేదా హెయిర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల చుండ్రు వస్తుంది.
ఇలా చేస్తే చుండ్రు EASY గా పోతుంది
- పెరుగు లో నిమ్మ రసం కలిపి తలకు బాగా మర్దన చేసుకొని 20 నిమిషాలు తరవాత కడుకోవాలి ఇలా చేస్తే ఈజీ గా చుండ్రు పోయే ఆస్కారం ఉంది.
- ఉసిరి పొడి లో నిమ్మ రసం కలుపుకొని తలకు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఉసిరి పొడి బయట ఎక్కడైన లేదా అమెజాన్ లో దొరుకుతుంది.
పోషకాహారలోపం
పోషకాహారలోపం అనేది కూడా హెయిర్ ఫాల్ కు ఒక ముఖ్య కారణం.మనం సరైన పోషకాహారం కానీ తీసుకుకోక పొతే అది మన జుత్తు పై ప్రభావం చూపిస్తుంది.పోషకాహార లోపం వలన మన హెయిర్ బలహీనం గా తయారై రాలటం జరుగుతుంది.ఈ పోషకాహార లోపం వలన జుత్తు రాలటమేకాక అనారోగ్యం కూడా వస్తుంది.
జుత్తు రాలకుండా ఉండాలన్న ,జుత్తు ఎక్కువగా రాలుతున్నది తగ్గాలి అన్న తీరిగి కొత్త జుత్తు మొలకెత్తాలి అన్న ఐరన్ ,విటమిన్ B 7, B 12,ఒమేగా 3,విటమిన్ D ఇవి మన ఆహారం లో భాగం కావాలి.అంటే ఇవన్నీ సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోవాలి. పాలు ,గుడ్లు , ఆకు కూరలు , డ్రైఫ్రూట్స్ ,చేపలు , మష్రూమ్ వంటివి మన ప్రతిరోజూ తీసుకుంటూ ఉండాలి.
ఎక్కువగా కెమికల్స్ ఉన్న హెయిర్ ప్రోడక్ట్స్ వాడటం
మనం ఈరోజుల్లో ఎం చేస్తున్నాం ఎక్కువగా కెమికల్స్ ఉండే షాంపూలు , హెయిర్ ప్రొడక్ట్స్ వాడు తున్నాం. ముఖ్యంగా సల్ఫేట్ ఉన్న ప్రొడెక్ట్స్ వాడటం వలన కూడా జుత్తు రాలడానికి ఒక కారణం.మనం వాడుతున్న సాంపులో సల్పేట్ వంటి కెమికల్స్ లేకుండా చూసి లేనివి వాడాలి. టీవీ లో యాడ్స్ చూసి ఏది పడితే అది వాడటం , ఎప్పుడు పడితే అప్పుడు షాంపూ మార్చడం వలన జుత్తు రాలటం మొదలవుతుంది.
కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్ వాడటం కంటే సహజ సిద్దమైన కుంకుడుకాయ లాంటివి వాడటం వలన జుత్తు రాలటం తగ్గవచ్చును.కుంకుడుకాయ లో యాంటీ పంగన్, యాంటీ బాక్టీరియా లక్షణాలు జుత్తు లోని మలినాలు , చుండ్రు ని తొలగిస్తాయి.కావున వీలైనంత వరకు కెమికల్ షాంపూ లు వాడకం తగ్గించాలి.
హెయిర్ డ్రైయర్ లు వంటివి వాడటం
మనం ఎక్కువగా హెయిర్ డ్రైయర్ లు మరియు హెయిర్ straightener లు వంటివి వాడడం వలన మన జుట్టు బలహీనంగా తయారవుతుంది. కాబట్టి ఎక్కువగా ఇలాంటి వి వాడకాన్ని తగ్గించడం చాల మంచిది.
తలా స్నానం చేసిన తర్వాత టవల్ తో తుడుచుకుని తలా దువ్వటం వంటివి చేయాలి. వేడి నీటి తో స్నానం చేయకుండా వుండటం చాలా మంచిది.
రక్త హీనతా
మన శరీరంలో రక్తం తక్కువ గా ఉన్న జుత్తు రాలటం నకి ఒక కారణం. కావున మన శరీరంలో రక్తం సరిపడినంత ఉందొ లేదో చెక్ చేస్కోండీ. సగటున 8 నుండి 12 పోయింట్స్ ఉండాలి. ఎర్ర రక్త కణాలు సంఖ్యా కూడా సరిపడినంత ఉండాలి.
శరీరంలో రక్తం పెరగాలంటే సరియైన ఫుడ్ తీసుకోవాలి.
ఆకుకూరలు నిత్యం తీసుకోవాలి. కార్జురం, డ్రైఫ్రూట్స్, వాళ్లనుట్స్ వంటివి తింటూ ఉండాలి. మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.
థైరాయిడ్ వంటి వాటివలన
థైరాయిడ్ మరియు కోవిడ్, వైరల్ ఫీవర్, డెంగీ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు. మహిళలు లో డేలేవేరి అయినా తరువాత ఎక్కువ జుత్తు ఉడటం మనం గమనిస్తాం.దీనికి సంబంధించిన డాక్టర్ కి చూపించి చికిత్స తీసుకోవటం ఉత్తమం.
ఇలాంటి సమయంలో మంచి ఆరోగ్య కరమైన ఆహరం తీసుకోవటం.జుత్తు కి మంచి కొబ్బరి నూనె తో మర్డన చేయటం వల్లన జుత్తు ఆరోగ్యం గా ఉంటుంది.
కాలుష్యం
కాలుష్యం వలన మన జుత్తు బలహీనంగా తయారవుతుంది. గాలి కాలుష్యం అనే కాదు కలుషితం అయినా నీటిలో మనం స్నానం చేయడం వలన కూడా జుత్తు పై ప్రభావం
చూపుతుంది. కాబట్టి మన జుత్తు కాలుష్యం నిండి కాపాడుకోవాలి.
వారానికి రెండుసార్లు లేదా మూడు సార్లు తలకు నీటిగా స్నానం చేయటం. నూనె రాసుకోవడం వలన మన జుత్తు ను కాలుష్యం నుండి కాపాడుకోవచ్చు.
DHT పెరగడం
DHT అంటే Dihydrotestosterone ఇది ఒక హార్మోన్.Dht హార్మోన్ testosterone హార్మోన్ వల్ల తయారు అవుతుంది. ఇది యవ్వనం వచ్చినప్పుడు తయారవుతుంది. దీని వలన శరీరంలో అసంఘటిక రొమాలు వస్తాయి,గుంతు మారుతుంది . DHT సరిపడినంత ఉంటే సమస్యా ఉండదు కానీ DHT ఎక్కువ అయితే మన తలా మీద జుత్తు పై ప్రభావం చూపుతుంది. దీని వలన బట్ట తల వస్తుంది.
ఈ DHT పెరగటం వలన జుట్టు బల హీనంగా మారుతోంది. జుత్తు పెరుగుదల ఆగి కొత్త జుత్తు మొలకుండా చేస్తుంది. కావున DHT లెవల్ తగ్గి సమంగా ఉండాలి అంటే మన అలవాట్లు మార్చుకోవాలి.పొగ త్రాగటం తగ్గించాలి, ఒత్తిడి తగ్గించు కోవాలి. ప్రతి రోజు EXERCISE చెయ్యడం, తలకు నూనె తో చక్కగా మర్దనా చేసుకోడం కూడా మంచిదే.
DHT బ్లాకెర్ ఫుడ్ తీసుకోవడం వలన ఈ DHT ని కంట్రోల్ చెయ్యొచ్చు. ఆరాట పళ్ళు , టమాటో, క్యారెట్ ,గ్రీన్ టీ , ఉల్లి ,కొబ్బరి నూనె ,చిక్కుడుకాయ ,పసుపు ,గుమ్మడి గింజలు ఇవి మన ఆహారంలో భాగం చేసుకోవాలి .
వారసత్వం
ఈ జుత్తు రాలటం కొందరిలో వారసత్వ పరంగా వస్తుంది. వాళ్ళ తాతలు, తండ్రులు ఈ జుత్తు రాలి పట్ట తలా రావటం అనేది ఉంటుంది. ఇలా వారసత్వం పరంగ వస్తే దానికి మనం చేసేది ఉండదు. ఏదయినా సరే వారసత్వ పరంగా వస్తే దానికి పరిస్కారం తక్కువాగా ఉంటుంది. కాని మన ప్రయత్నం మనం చెయ్యాలి. వారసత్వ పరంగా జుత్తు రాలడం ఉన్నవారూ కూడా ఈ చిట్కాలు పాటించడాం ద్వారా కొద్దిగా నివారించేందుకు ఆస్కారం ఉంది.
click here 👇👇👇👇👇 క్లిక్ చేయండి
0 కామెంట్‌లు