list of comedy movies Telugu
సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మరియు ఎంజాయ్మెంట్. మనకున్న ఈ బిజీ లైఫ్ లో కాస్త రిలీఫ్ సినిమా. ఎంత ఒత్తిడి లో ఉన్న ఒక మంచి సినిమా చుస్తే చాల రిలాక్స గా ఉంటుంది. అందులోను మంచి నవ్వు తెప్పించే కామెడీ మూవీ చుస్తే ఇంకా ఆనందం గా ఉంటుంది.
మన తెలుగు మూవీస్ లో ఇలాంటి నవ్వు తెప్పించే సినిమాలు చాల ఉన్నాయ్. అందులో తెలుగు కామెడీ మూవీస్ అనగానే గుర్తొచ్చే టాప్ మూవీస్ మీకోసం.
ALL-TIME TOP 19 Telugu Comedy Movies
సొంతం
తెలుగు కామెడీ మూవీస్ వచ్చేసరికి మనకు ముందుగా గుర్తొచ్చే మూవీ సొంతం. ఇందులో సునీల్ చేసిన కామెడీ అంత ఇంతా కాదు. మూవీ మొదటి నుండి కడుపుబ్బా నవ్వించే మూవీ.ఈ మూవీ వలన కమిడియన్ గా సునీల్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా.
సొంతం సినిమాలో సునీల్ తో పాటు ms నారాయణ గారి కామెడీ కూడా మూవీ కి హైలైట్. సునీల్ తన ఇద్దరి ఫ్రెండ్స్ తో చేసే కామెడీ, సునీల్, ఎమ్ ఎస్ నారాయణ్ పోలీస్ లకు దొరికినపుడు , సునీల్ అమ్మ గారు కాలేజీ వచ్చి సునీల్ కొట్టటం ఇలా అల్ టైం పంచ్ లతో మనల్ని ఫుల్ గా నవ్విస్తాయి.
వెంకీ
మాస్ మహారాజ్ రవితేజ నటించిన వెంకీ తెలుగు లో ఒక బెస్ట్ కామెడీ మూవీ గా నిలుస్తుంది. ఇందులో ట్రైన్ లో కామెడీ ఎప్పుడు చూసిన ఫుల్ గా నవ్వొస్తుంది.బ్రహ్మానందం గజాల గా చేసినా రచ్చ అంట ఇంత కాదు.
వెంకీ మూవీ లో జగదాంబ చౌదరి తో జోస్యం నవ్వు తెప్పిస్తుంది.చిత్రం శ్రీను ,శ్రీనివాస్ రెడ్డి రవితేజ ఫ్రెండ్స్ లా కామెడీ టైమింగ్ మనలని ఫుల్ గా నవ్విస్తుంది.
దుబాయ్ శ్రీను
రవితేజ సినిమా అంటేనే మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. ప్రేక్షకులుకు కడుపు నిండా నవ్విస్తారు. అలాంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ లో దుబాయ్ శ్రీను ఒకటి. దుబాయ్ వెళ్ళాలి అనుకున్న రవితేజ వాళ్ళ ఫ్రెండ్స్ బ్రహ్మానందం వల్ల వేణుమాధవ్ చేతిలో మోస పోతారు.
ఆ తరువాత ముంబై లో చిన్న టిఫిన్ బండి దగ్గర పనిచేస్తూ వాలా కామెడీ, ముంబై నుండి వచ్చి దుబాయ్ నుండి వచ్చినట్టు రవితేజ కామెడీ ఇలా అన్ని విధాలుగా మనల్ని ఈ మూవీ నవ్విస్తుంది.
నువ్వు నాకు నచ్చావ్
వెంకటేష్ గారు నటించిన నువ్వు నాకు నచ్చావ్ కంప్లీట్ ఫ్యామలీ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. వెంకటేష్ కు ఆర్తి అగర్వాల్ ఆట పట్టించడాలు చాల నవ్వు తెప్పిస్తాయి.
వెంకటేష్ కు వలన నాన్న రాసిన లెటర్ చదివినపుడు, వెంకటేష్ సునీల్ కు మధ్య సన్నీ వేశాలు , బ్రహ్మానందం కామెడీ ఇలా మొత్తం గా నువ్వు నాకు నచ్చావ్ మన అందరికి చాల నవ్విస్తుంది.
మల్లీశ్వరి
పెళ్లి కానీ ప్రసాద్ లా వెంకతెశ చేసిన కామెడీ అంత ఇంత కాదు. బ్యాంకు లో పని చేసే మన పెళ్లి కానీ ప్రసాదు అంతః పురం రాణి . అయినా మల్లీశ్వరిని ప్రేమించడం ఆమెను ఆకట్టుకునేందుకు ప్రసాద్ పడ్డ కష్టాలు మనల్ని బాగా నవ్విస్తాయి.
వెంకటేష్ మరియు బ్రహ్మానందం లా మధ్య కామెడీ సన్నీ వేశాలు, వెంకటేష్ సునీల్ కు కథ చెప్పటం, పెళ్లి కోసం వెంకటేష్ పడిన కష్టాలు అన్ని మనల్ని బాగా నవ్విస్తాయి.
మన్మధుడు
నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ మన్మధుడు. ఇందులో నాగార్జున అమ్మాయిలు అంటే పడదు ఇలా తన ఆఫీస్ లో ఉన్న అమ్మాయిలతో ఉండే విధానం నవ్విస్తుంది. హీరోయిన్ కి తెలియకుండా మైక్ తన టేబుల్ కింద పెట్టి మాటలు వినటం ఇవ్వన్నీ చాల బాగుంటాయ.
ఈ మూవీ లో నాగార్జునా బ్రహ్మానందం మధ్య పారిస్ లో జరిగిన కామెడీ అద్భుతంగా ఉంటుంది. హీరొయిన్ కి నాగార్జున కి మధ్య సన్నివేశాలు బాగా నవ్వు తెప్పుస్తాయి.
నువ్వే నువ్వే
తరుణ్ , శ్రీయ నటించినా నువ్వే నువ్వే మూవీ మంచి యూత్ ఫుల్ కామెడీ మూవీ గా చెప్పుకోవచ్చు. హీరో , హీరోయిన్ లా మధ్య చాల కామెడీ గా ఉంటుంది. తరుణ్ శ్రీయను ఏడిపించడం వంటి కామెడీ సన్నీ వేశాలు ఎన్నో ఉన్నాయ్ .
సునీల్ కామెడీ కూడా హైలైట్ . కాలేజీ లో కామెడీ , తరుణ్ నాన్నా తరుణ్ ని తిట్టడం, ప్రకాష్ఇ రాజ్ తో కామెడీ ఇలా అన్ని విధాలా ఈ మూవీ మనల్ని నవ్విస్తుంది.
రేస్ గుర్రం
స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నటించినా రేస్ గుర్రం కూడా మనల్ని మొదటి నుండి బాగా నవ్విస్తుంది. ఈ మూవీ లో అల్లు అర్జున్ తానాడైనా శైలి లో దేవుడా ...! అంటూ నవ్విస్తారు. హీరోయిన్ శృతిహాసన్, వాళ్ళ ఫ్యామిలీ రూల్స్ మనల్ని బాగా నవ్వు తెప్పిస్తాయి .
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గ ఎంట్రీ ఇచ్చి మనల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తారు మన కామెడీ కింగ్ బ్రహ్మ నందం గారు. ఇందులో విలన్ నటన కూడా మనకు నవ్వు తెప్పిస్తుంద
బాద్ షా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించినా బాద్ షా మూవీ మాస్ మూవీ అయినా మనల్ని బాగా నవ్విస్తుంది. ఎన్టీఆర్ కాజల్ ఇద్దరి మధ్య కామెడీ బాగుంటుంది. తరవాత మన పద్మనాభ సింహ క్యారెక్టర్ లో బ్రహ్మానందం గారు వచ్చిన తరవాత నవ్వ లేక పొట్ట చెక్కలవుతుంది.
ఈ మూవీ లో బ్రహ్మానందం డ్రీమ్ మిషన్ కామెడీ అల్ టైం బెస్ట్ కామెడీ అని చెప్పవచ్చు. డ్రీమ్ లో ఉన్నట్టు బ్రహ్మానందం గారు చేసే పనులుకు మనం నవ్వకుండా ఉండలేం
అహ నా పెళ్ళంట
రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన అహ నా పెళ్ళంట ఒక బెస్ట్ కామెడీ మూవీ గా ఎప్పటికి చరిత్రలో నిలిచి పోతుంది. ఇందులో కోట శశ్రీనివాస్ రావు గారు తన నట విశ్వరూపంతో మనల్ని కడుపు నిండా నవ్విస్తారు.
ఈ మూవీలో కోట శ్రీనివాస్ ఒక పరమ పిసినారిగా అతని దగ్గర పనివాడిలా బ్రహ్మానందం వీళ్ళిద్దరి కామెడీ తో బాగా నవ్వకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ కోట శ్రీనివాస్ కి పోటీ గా తనకు అల్లుడు అవ్వటం కోసం చేసే కామెడీ అంట ఇంత కాదు.
అదుర్స్
తెలుగు కామెడీ మూవీస్ అనగా మనకు తప్ప కుండా గురుస్తోంది అదుర్స్ మూవీ ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ , బ్రహ్మానందం పంతుళ్లు గా చేసినా కామెడీ అలాంటిది మరి.
గురు శిస్యులు గ జూ. ఎన్టీఆర్ బ్రహ్మానందం కామెడీ తో మనల్ని పొట్ట చెక్క లయ్యేలా నవ్విస్తారు. గురువు గారు మంత్రాలూ రాకపోయినా ప్రేమిస్తారు. శిస్యుడు తన మంత్రాలతో అమ్మాయిని పడేస్తాడు.
జంబ లకడి పంబ
ఫస్ట్ నుండి లాస్ట్ వరకు బాగా నవ్వుకునే చిత్రం ఏదయినా ఉంది అంటే అది జంబ లకడి పంబ తరవాతే. సినిమా మొత్తం నవ్వులే నవ్వులు. ప్రతి సన్నివేశం మనల్ని పొట్ట చెక్క లయ్యేలా నవ్విస్తుంది.
అడా వారు మెగా వారిలా, మగవారు ఆడవారి లా మారి వారి కట్టు బాట్లు వీరు వీరి పద్ధతులు వారు పాటిస్తూ మనల్ని క్షణం కూడా తీరిక లేకుండా నవ్విస్తుంది ఈ సినిమా.
సుడిగాడు
టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ నటించినా సుడిగాడు మంచి కామెడీ సినిమాలలో ఒకటి. ఈ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వులే, నవ్వులు. ఒక్క టికెట్ తో 100 సినిమాలు చూసినట్టు ఉంటుంది. టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల ను స్పూఫ్ లు చాల నవ్వు తెప్పిస్తాయి.
సీమశాస్త్రి
అల్లరి నరేష్ నటించిన ఎన్నో కామెడీ చిత్రాల్లాలో సీమశాస్త్రి ఒకటి. పంతులు గా మన అల్లరి నరేష్ కామెడీ అంత ఇంత కాదు. ఒక పంతులు ఫామిలీ ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫామిలీ తో వియ్యరికం కోసం ఎలాంటి ప్లాన్స్ వేస్తారో ఎలాంటి పనులు చేస్తరో చుస్తే చాల నవ్వు వస్తుంది.
తప్ప కుండా చూడవలసిన తెలుగు కామెడీ మూవీస్ లో ఇది ఒకటి
భలే భలే మగాడివోయ్
నాచురల్ స్టార్ నాని నటించిన భలే భలే మగాడివోయ్ కూడా మనతో నవ్వులు పూయిస్తుంది. మతి మరుపు తో నాని చేసిన కామెడీ మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. తన మతి మరుపు సమస్య కప్పి పుచ్చి కోటానికి నాని పడ్డ కష్టాలు చేసే పనులు మనల్ని చాల నవ్విస్తాడు.
F2
ఫన్ అండ్ ఫ్రెస్టేషన్స్ తో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ నటించిన f 2 ఒక మంచి కామెడీ మూవీ గా అలరించింది. భార్య లా వళ్ళ ఫ్రెస్టేషన్స్ తో వెంకటేష్ చేసే పనులు బాగానవ్విస్తాయి .
జాతిరత్నాలు
క్రిందటి సంవత్సరం విడుదల అయినా జాతిరత్నాలు మనల్ని ఎంతగానో నవ్వించింది. ముగ్గురు చిచోరా ఫ్రెండ్స్ చేసిన రచ్చ మనల్ని చాల నవ్విస్తుంది. ఈ మూవీ చూడక పొతే చూసేయండి.
0 కామెంట్‌లు