ఇలా బరువు తగ్గించుకోండి సులభంగా
బరువు ఉండల్సిన దాని కన్నా ఎక్కువ ఉంటె ఎన్ని నష్టాల్లో మనకి తెల్సిందే. మనం ఎన్ననుకున్నా ఊబకాయం తో ఉన్నవారిని ఈ సమాజం కాస్త వ్యగ్యంగా చూస్తుంది. వాళ్ళు వీలు చూస్తారు ఎదో అనుకుంటారని కాదుగాని మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
అధిక బరువు కారణంగా గుండె కి సంబందించిన వ్యాధులు, మధుమేహం మరియు నాడి వయ్వస్థకి సంబందించిన అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాల ఎక్కువగా ఉంటుంది.మనం అనుకునే పని చేయటం కూడా అంత సులభం కాదు. నలుగురిలోకి వెళ్ళటానికి మనకి నామోషిగా ఉంటుంది.
బరువు పెరగటానికి కారణాలు :
ప్రపంచంలో ఊబకాయం అనేది అంటువ్యాధి లా తయారైంది. మనం బరువు పెరగటానికి ముఖ్య కారణాలు ఏంటంటే, ప్రధానమైనవి మన అలవాట్లు. అనేక జంక్ ఫుడ్స్ తింటాం, శారీరకంగా exercise లు చెయ్యం, సమయానికి భోజనం చెయ్యం , ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి లోనవుతాం. చేసే పని తక్కువ తినే తిండి ఎక్కువ.
బరువు తగ్గాలి ఫిట్ గా ఉండాలి అంటె మూడు సూత్రాలు పాటించాలి:
1. జంక్ ఫుడ్స్ మరియు ఇతర అనారోగ్యకరమైన ఆహారాలు తినటం తగ్గించాలి.
2. ఆరోగ్యకరమైన కూరగాయలు, పళ్ళు వంటివి అలవాటు చేసుకోవాలి.
3. ప్రతిరోజూ మనకు తోచినంత సమయం exercise చెయ్యాలి.
మన అలవాట్లు మారనంత వరకు మన శరీరంలో గాని , మనం చేసే వృత్తిలో కానీ ఎటువంటు మార్పు రాదు. మన ఆహార అలవాట్లు మారాలి. అనారోగ్య కరమైన ఫుడ్స్ తగ్గించి, ఆరోగ్యకరమైన కూరగాయలు, పళ్ళు , గుడ్లు వంటి బరువు తగ్గించే ఆహారం అలవాటు చేసుకోవాలి. సమయానికి భోజనం చెయ్యాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ మానకూడదు. నీళ్లు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి.
మనం కష్ట పడకుండా బరువు పెరిగినట్టు కాస్త అయిన కష్ట పడకుండా దాన్ని తగ్గించలేం. బరువు తగ్గాలి, ఫిట్ గా తయారవ్వాలి అంటే పెద్ద పెద్ద బరువులు ఎత్తటం, జిమ్ లో భారీగా వర్కౌట్స్ చేయటం లాంటివి కాకుండా సింపుల్ గా ఇంట్లోనే చేసుకొని ఫిట్ గా తయారయ్యా వర్కౌట్స్ చాల ఉన్నాయ్ అందులో బరువు తగ్గటం లో ఉపయోగ పడే కొన్ని exercises మీకోసం
బరువు తగ్గించే సింపుల్ exercises
నడవటం (Walking )
ఫిట్ గా ఉండటానికయిన, బరువు తగ్గటానికయినా నడక అనేది ఒక గొప్ప EXERCISE. బరువు తగ్గటానికి నడవటం చాల మంచిది.
నడక వలన బరువు తగ్గటం కాస్త సమయం పట్టినా, బరువు తగ్గటానికి ఉన్న అనేక మార్గాలలో అన్నిటికంటే అతి సులభమైన, సురక్షితమైన వ్యాయామం (EXERCISE ) నడవటం.
బరువు తగ్గటానికి కేవలం నడక నడిస్తే నే సరిపోదు నడక తో పాటు ఇతర వ్యాయామాలు, సరైన ఆహారం తీసుకుంటేనే మనం అనుకున్న ఫలితం ఉంటుంది.
రోజు నడుస్తున్నాం కదా అని, జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైనవి తింటే ఎటువంటి ఫలితం ఉండదు.
రోజుకు 50 నిమిషాలు నుండి 70 నిమిషాలు చొప్పున కనీసం వారానికి 3 రోజులు నడిస్తే బరువు తగ్గటానికి సహాయ పడుతుంది.
ఒక గంట సమయం మనం నడిస్తే 350 క్యాలరీ లు కరుగుతుంది.
నడవటం వల్ల లాభాలు :
- మన శరీరం లో కొవ్వు కరుగుతుంది.
- శరీర మెటబాలిజం వృద్ధి చెందుతుంది.
- గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- కండరాలు బలంగా తయారవుతాయి
రోజుకు 10,000 STEPS నడిస్తే చాలచాల మంచిది. మీ మొబైల్ లో స్టెప్ కౌంటర్ పెట్టుకొని 10,000 టార్గెట్ పెట్టుకోండి.
రన్నింగ్ & జాగింగ్
బరువు తగ్గటం కోసం జాగింగ్ చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది. రన్నింగ్ చేయటం లేదా జాగింగ్ చేయటం ఒక అద్భుతమైన exercises. కొవ్వు కరిగి బరువు తగ్గించటం లో జాగింగ్ ఒక సమర్ధవంతమైన exercise.
మీరు బరువు తగ్గటానికి ఫిట్ గా ఉండటానికి చేసే ఇతర exercises తో పోలిస్తే జాగింగ్ లేదా రన్నింగ్ తో ఉత్తమ ఫలితం ఉంటుంది.
జాగింగ్ వలన చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. జాగింగ్ లేదా రన్నింగ్ అనేవి ఫుల్ body వర్కౌట్.
వాకింగ్ తో పోల్చు కుంటే జాగింగ్, రన్నింగ్ వలన మంచి ఫలితాలు ఉంటాయి మరియు కొవ్వు వేగంగా కరుగుతుంది.
జాగింగ్ 30 నిమిషాలు చేస్తే చాలు 300 క్యాలరీలు తగ్గుతుంది.
రన్నింగ్ & జాగింగ్ వలన ఇతర ఆరోగ్య ప్రయోజనాలు :
- ఎముకులు దృడంగా తయారవుతాయి.
- ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
- గుండె ఆరోగ్యానికి మంచిది.
- రోగ నిరోధకత పెరుగుతుంది.
- మానసికంగా దృడంగా ఉంటారు.
స్కిప్పింగ్ (skipping )
బరువు తగ్గటానికి మరో బెస్ట్ exercise స్కిప్పింగ్. స్కిప్పింగ్ అంటే ఏంటో మనందరికీ తెలిసిందే మనం చిన్నపుడు నుండి ఎప్పుడో ఒక సందర్భంలో ఒక్కసారి అయినా చేసి ఉంటాం.
స్కిప్పింగ్ వలన మనం అనేక క్యాలరీలు కరుగుతుంది. మీరు రోజు స్కిప్పింగ్ చేసి సరైన ఫుడ్ తీసుకునట్లయితే మీరు చాల తక్కువ సమయంలోనే చాల బరువు తగ్గవచ్చు.
ఒక విధంగా చెప్పాలి అంటే రన్నింగ్, జాగింగ్ లా కంటే స్కిప్పింగ్ వలన వేగంగా బరువు తగ్గవచ్చు. 30 నిమిషాలు జాగింగ్ చేస్తే 300 క్యాలరీలు కరుగును అదే క్యాలరీలు స్కిప్పింగ్ చేస్తే 20 నిమిషాలలో చాలు.
20 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే 300 నుండి 400 క్యాలరీలు కరుగుతుంది.
స్కిప్పింగ్ వలన ప్రయోజనాలు :
- గుండె ఆరోగ్యానికి మంచిది.
- మానసిక ఆరోగ్యానికి మంచిది.
- శక్తిని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది.
- ఎముకులను బలోపితం చేస్తుంది
యోగ (yoga )
యోగ కొన్ని వేల ఏళ్లుగా మన దేశంలో ప్రసిద్ధిగాంచింది. యోగ చేయటం వలన మనం ఆరోగ్యపరంగా , ఆధ్యాత్మకంగా మరియు మానసికంగా వృద్ధి చెందుతాం. యోగ మీలోని బెస్ట్ వెర్షన్ ని క్రీట్ చేస్తుంది.
బరువు తగ్గటానికి యోగ చాల అనువైనది. యోగ చేయటం వలన మనం బరువు తగ్గుతాం ఎందుకంటే యోగ వలన మనలో చాల క్యాలరీ లు తగ్గుతాయి. యోగ వలన మనసు కి శరీరం కు మంచి సంబంధం ఏర్పడుతుంది.
యోగ వలన మన మనసుకు, మన శరీరానికి అనుబంధం ఏర్పడటం వల్ల, మనకు మన ఆహారాలవాట్లు మీద, మన నడవడిక మీద ఆధిక్యత వస్తుంది. దీని వలన మనం మానసికంగా, బౌతికంగా బరువు తగ్గటానికి సన్నధం అవుతాము.
బరువు తగ్గటానికి 5 యోగాసనాలు
- చతురంగ దండాసనం (plank pose)
- వీరభద్రాసనం (warrior pose)
- త్రికోణాసనం (triangel pose)
- అదో ముఖస్సావనామం (down word dogpose)
- మనలో సేతు బందా సర్వాంగాసనం (bridge pose)
Push-ups
మనలో చాల మంది పుష్ అప్స్ ఛాతి కి సంబందించిన exercise మాత్రమే అనుకుంటారు. పుష్ అప్స్ ప్రదానం గా కండరాలు మరియు ఛాతి బలంగా చేస్తుంది. దీనివల్ల ఛాతి, భుజాలు , ట్రిసెప్స్ వంటి భాగంలో కొవ్వు కరుగుతుంది.
పుష్ అప్స్ పూర్తిగా అప్పర్ బాడీ వర్కౌట్, మనం చేసే ఎక్కువ వర్కౌట్స్ లో లోయర్ బోడి కి సంధించి ఉంటాయి. అందువల్ల ఫాట్ లాస్ కి ఇది ఒక కారణం.
Squats
squats బరువు తగ్గించే exercises లో చాల సులభమైనది. squats చేసినపుడు లోయర్ బోడి లో అన్ని కండరాలు తో పాటు అప్పర్ బోడి లో కొన్ని కదులుతాయి. దీని వల్ల చాల ఫాట్ అనేది కరుగుతుంది.
Planks
ప్లాంక్ వ్యాయామం పొట్ట మరియు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.
కొవ్వు కరిగించి బరువు తగ్గుటకు ఉపయోగపడే మరిన్ని వ్యాయామాలు (EXERCISES )
LUNGES
MOUTAIN CLIMBS
LEG RISES
0 కామెంట్‌లు