publisherpro

చైనా, తైవాన్ మధ్య కథేంటి ? అమెరికా కు తైవాన్ పై ప్రేమెందుకు

 చైనా, తైవాన్  మధ్య కథేంటి ?

china vs taiwan in telugu




ప్రపంచ జనాభాలో మొదటి స్థానం లో ఉన్న చైనాకి, అత్యంత చిన్న ద్వీపం అయినా తైవాన్ కి మధ్య అసలు సంబంధం ఏంటో తెలుసుకోవాలి అంటే, దశాబ్దాలు కాలంగా  ఈ రెండిటి మధ్య ఏర్పడిన యుద్ధ, రాజకీయ పరిణామాలు తెలుసుకోవాలి.

తైవాన్  1624-1661 వరకు డచ్ పాలనలో లో ఉంది. 1683-1895 వరకు చైనాను పాలించిన క్విన్గ్ పాలకులు పాలించారు. 1895 చైనా vs  జపాన్  యుద్ధం లో చైనా ఓడిపోయి తైవాన్ ను జపాన్ కు వదులుకుంది. 1945 రెండవ ప్రపంచ యుద్ధం లో ఓడిపోయినా జపాన్ తైవాన్ ను చైనా కు అప్పగించింది. అప్పటికే చైనాలో  అధికార kmt పార్టీకి, మావో కు చెందినా కమ్యూనిస్ట్ పార్టీకి అంతర్యుద్ధం జరుగుతుంది. 


రిపబ్లిక్ అఫ్ చైనా ఏర్పాటు 

ఈ అంతర్యుద్ధంలో ఓడిపోయిన kmt   పార్టీ  శ్రేణులు దాదాపు 20 లక్షల మందితో, అధిక మొత్తం డబ్బుతో తైవాన్ కు వలస వెళ్లి తైవాన్ ను రిపబ్లిక్ అఫ్ చైనా గా ప్రకటించుకున్నారు. అయితే ప్రధాన చైనా ను పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనా గా పిలుచుకున్నారు. 1971 వరకు రిపబ్లిక్ అఫ్ చైనా(తైవాన్) నే చైనాగా గుర్తించబడేది. 

AMAZON

వన్ నేషన్ గా చైనా 

1971 లో రిపబ్లిక్  అఫ్ చైనా కు ఐరాస సభ్యత్వం పొంది తామే అసలైన చైనా గా ప్రకటించుకుని తైవాన్ ను చైనీస్ తైపీ గా పిలవాలని మరియు తైవాన్ తో దౌత్య పరమైన సంబంధాలు పెట్టుకోకూడదు అని షరతు విధించింధీ. దీనికి అమెరికా , భారత్ వంటి దేశాలు కూడా అంగీకరించాయి. ఆ తరవాత కూడా చైనా తైవాన్ ను చాలాసార్లు ఆక్రమించు కోవాలని చూసింది కానీ అగ్ర దేశాల మద్దతు తో తైవాన్ చైనాను ప్రతిఘటిస్తూ వచ్చేది. 

చైనా - తైవాన్ ఒప్పందం 

1992 లో అప్పటి చైనా నాయకులూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేంటంటే చైనా, తైవాన్ ఒకే దేశంగా ఉండాలని కానీ తైవాన్ తనను తాను సొంతంగా పాలించుకోవచ్చు అని. ఈ ఒప్పందం తరవాత తైవాన్ వేగంగా అభిరుద్ది చెందుతూ ఎలట్రానిక్ హబ్ గా ల మారింది మారరు అక్కడా ప్రజలలో మేము చైనీస్ కాము తైవానీస్ అని తిరుగుబాటు మొదలైంది. చైనా కూడా యుద్ధ విన్యాసాలతో  తైవాన్ ప్రజలను ఎప్పటికప్పుడు భయపెడుతూ ఉండేది. 

అమెరికా కు ప్రేమెందుకు 

అయితే మారుతున్నా ప్రపంచ రాజకీయ పరిణామాలు వలన చైనాకు, అమెరికాకు మధ్య పోటీ, వైరం ఏర్పడింది. అంతే కాకుండా అమెరికా తైవాన్ తో సంబంధాలు మొదలు పెడుతూ యుద్ధ సామాగ్రి,ఎయిర్ జెట్స్ వంటి అందిస్తూ తైవాన్ కు మేము ఉన్నాం అనే భరోసా ఇచేలా వ్యవహరిస్తోంది. ఇటీవల జరుగుతున్నా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ని ఆసరా గా తీసుకొని చైనా తైవాన్ ను ఆక్రమించటానికి చూస్తుంది. 

ప్రస్తుత పరిస్థితి ఏటో 

ఇది ఇలా ఉంటె అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ తైవాన్ పర్యటన ఈ వివాదం మరింత ముదిరింది. ఈ వివాదం ఇలా అగ్ర రాజ్యాల మధ్యమాట మాట పెరిగి ఉక్రెయిన్ లా తైవాన్ ను బలి పశువుని చేస్తారా ? లేకా  మరో ప్రపంచ సంక్షోభం లా మారుతుందో చూడాలి.

అమెరికా ను నమ్మి బలి అయినా దేశాలు  

మొన్న ఆఫ్గనిస్తాన్ నుండి మొదలు పెడితే, నిన్న ఉక్రెయిన్ ఇప్పుడు తైవాన్ ఇలా అమెరికా అండగా ఉంటాం అని భరోసా ఇచ్చి నట్టేట ముంచింది. వారికీ పోటీ గా వచ్చే ఆగ్రా దేశాలు కి ఝలక్ యుద్ధం అని పసికూనలను బలిచేస్తుంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు