చిన్న టౌన్ నుండి ఇంతటి పెద్ద కల వరకు
రింకు సింగ్ , రింకు సింగ్ కల అనుకున్నది నిజం చేసి చూపించాడు. అదేంటి 5 సిక్సర్లు కొడితే కల ఎలా అవుతుంది, మరెవరు కొట్టలేదా ?? అని మీరు అనుకోవచ్చు , యువరాజ్ సింగ్ 6 బంతులలో 6 సిక్సర్లు కొట్టాడుగా అతని కన్నా గొప్పేమి కాదు.
యువరాజ్ సింగ్ ఒక GOAT ప్లేయర్ అతను తో పోల్చడం లేదు. కల అంటే మన దేశంలో క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ ఏ ఆట కి లేదు. అందులోను IPL ప్రపంచంలో ఒక పెద్ద లీగ్ , క్రికెట్ గురించి తెలిసిన ప్రతిఒక్కరు ఐపీల్ ని ఎంతో ఆశక్తిగా చూస్తారు. యువత ఐపీల్ లో ఆడాలి అని కలలు కంటారు.
అలాంటి ipl లో KKR కు చివరి ఓవర్ లో దాదాపు చివరి 5 బంతుల్లో 30 రన్స్ కావాలి, ఎవరైనా KKR గెలుస్తుంది అనుకుంటారా?? , కానీ చివరి 5 బాల్స్ లో 5 సిక్సర్లు కొట్టి తన జట్టు కి విజయాన్ని అందించాడు. ఎటువంటి బ్యాట్స్ మెన్ కి అయిన ఇది ఒక కలలాంటిదే కదా .
ఎక్కడ నుండి వచ్చాడు
రింకు సింగ్ 12 అక్టోబర్ 1997 లో ఉత్తరప్రదేశ్ లో అలీఘర్ అనే ఒక చిన్న టౌన్ లో జన్మించాడు. తండ్రి ఒక సాధారణ LPG గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆఫీస్ లో పనిచేసే వాడు. నెలకు 12 వేల ఆదాయం మాత్రమే, రెండు గదులు కలిగిన చిన్న ఇంటిలో రింకు సింగ్ తన తల్లిదండ్రులు ఇంకా అన్న, చెల్లెలు ఉండే వారు.
క్రికెట్ తన ఊపిరి
రింకు కు చదువు మీద ఆశక్తి కన్నా క్రికెట్ మీద ధ్యాస ఎక్కువ. క్రికెట్... క్రికెట్.. ఇదే తన జీవితం. ఎక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఉన్న వెళ్లి ఆడేవాడు. క్రికెట్ నే తన ఊపిరిగా నమ్మి పట్టు దలతో కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఫలితం ప్పుడు మీరు చూస్తున్న ఈ నమ్మలేని కల.
రింకు సింగ్ ఉత్తర ప్రదేశ్ తరుపున U 16, U 19, U 23 ఆడాడు. 2014 Team A లో 2016 రంజిలో కి ఎంపికయ్యాడు. 2017 లో లింగ్స్ లెవెన్ పంజాబ్ 10 లక్షల లకు ఐపీల్ వేలం లో దక్కించు కుంది.కానీ ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఐపీల్ లో సెలెక్ట్ అవ్వగానే తన తండ్రికి ఉద్యోగం మాన్పించాడు.
కోల్కతా కు ఆలా దొరికాడు
2018 లో ఒక Campaign మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో 31 బాల్స్ లో 91 రన్స్ కొట్టి అందరిని ఒక్కసారిగా ఆకర్శించాడు. ముఖ్యంగా KKR 2018 సంవత్సరంలో కోల్కత్త ఏకంగా 80 లక్షలకు రింకు సింగ్ ను కొనుగోలు చేసింది. అప్పటి నుండి పెద్దగా అవకాశం రాకపోయినా kkr రింకు ని వదులుకోలేదు.
నమ్మకం నిలబెట్టి & నోళ్లు మూయించాడు
ఈ సీజన్ లో 2023 లో తనని నమ్మిన KKR ఫ్రాంచైజ్ ఋణం తీర్చుకున్నాడు. RCB తో 46 & GT తో విద్వాంసం మైన ఎవరు నమ్మలేని ఇన్నింగ్స్ తో kkr తన మీద నమ్మకాన్ని ననిలబెట్టుకొని కోల్కతా కు ఒక మ్యాచ్ విన్నర్ ల మారాడు.
KKR కి ఏమైనా పిచ్చ ఎందుకు ఎప్పుడు రింకు సింగ్ ని కొంటుంది. వీడెవడ్రా బాబు అన్నవాళ్ళ నోళ్లు ఒక్క ఇన్నింగ్స్ తో మూయించాడు.
రింకు సింగ్ ఇలాగే తన ఆటతో బాగా రాణించి ఇంకా చాల మంచి మంచి విజయాలు అందుకొని తన కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుందాం
Written by
sriram kurmanayakulu
His father used to deliver LPG Cylinders from an LPS gas agency in Lucknow. Rinku Singh used to help his family financially by the small amount of money he got after playing state level tournaments. He once won a motercycle and gave it to his father to.#rinkusingh #KKRvGT pic.twitter.com/QJslmOdLMY
— ĐɆVƗŁ 𓊈 AKKI𓊉 (@akki_madho) April 9, 2023
0 కామెంట్‌లు