WTC Final లో మన బలం, బలహీనతలు ఇవే
దాదాపు రెండు నెలలు గా ఐపీల్ అదరగొట్టింది . ఎటు చుసిన ఫోర్లు, సిక్సర్లతో మోత మోగిపోతుంది. మే 28 ఫైనల్ తో ఐపీల్ 2023 గ్రాండ్ గా ముగుస్తుంది. ఆ తరవాత అందరి కళ్ళు టెస్ట్ ఛాంపియన్ లీగ్ ఫైనల్ పైనే .
జూన్ 7 న జరగబోయే టెస్ట్ ఛాంపియన్ లీగ్ ఫైనల్ కు ఆస్ట్రేలియా, మన ఇండియా అర్హత సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. గత సారి 2021 టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ కోహ్లీ సారధ్యంలో చిక్కినట్టే చిక్కి ఫైనల్లో న్యూజీలాండ్ తో ఓటమి వలన చేజారిపోయింది.
అయితే ఈ సారి రోహిత్ సేన ఎలగ్హైనా ఫైనల్ లో గెలిచి మన ఇండియాకు మొదటి టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ అందించాలని పట్టుదలతో ఉన్నారు. అయితే అవతల జట్టు ఆస్ట్రేలియాను అంత తక్కువగా తీసి పడేయలేం.
కెప్టెన్ కమిన్స్, స్మిత్, స్టార్క్ వంటి మేటి ఆటగాళ్లతో బలంగా ఉంది.మొదటి సారి ఫైనల్ కి వచ్చిన కంగారూలు ఎలగ్హైనా ఇండియా పై గెలిచి ట్రోఫీ సొంతం చేసుకోవాలని ఉవ్విళూరుతున్నారు .
అప్పటికి, ఇప్పటికి తేడా ఏంటంటే
2021 జూన్ లో జరిగిన WTC ఫైనల్లో ఇండియా న్యూజీలాండ్ చేతిలో 8 వికెట్ల తో ఓటమి పాలయింది. ఇండియా బాటింగ్ లైన్ అప్ లో ఒక్కరు కూడా అర్ద సెంచరీ కూడా చేయలేదు.
2021 ఫైనల్ ఇంగ్లాడ్ లోని SOUTHAMTON లో జూన్ 18 నుండి జరిగింది. ఈ ఏడాది కూడా ఇంగ్లాండ్ లోనే ది ఓవల్ లో జూన్ 7 నుండి జరగనుంది.
2021 లో మే 2 వరకు ఐపీల్ జరిగింది ఆ తరవాత Covid-19 వలన పోస్ట్ఫోన్ చేసారు. మన ఇండియన్ ఆట గాళ్ళకు అప్పుడు 50 డేస్ గ్యాప్ వచ్చింది ఫైనల్ కి .
ఈ సారి అయితే డైరెక్ట్ గా ఐపీల్ అవ్వగానే మే 23 నుండి 3 విడతలు గా ఇండియన్ టీం ఇంగ్లాండ్ వెళ్లనుంది. అసలు గ్యాప్ లేదు. డైరెక్ట్ గా ఐపీల్ టు wtc అంటే టీ 20 నుండి టెస్ట్ మ్యాచ్కు.
ఇండియన్ టీంలో అప్పుడుకూ ఇప్పుడు కు కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. గాయం కారణంగా రిషబ్ పంత్ , బుమ్రా , రాహుల్ WTC నుండి వైదొలిగారు. టీం లోకి కొత్తగా అక్సర్ పటేల్, ఇషాన్ కిషన్, శార్దూల ఠాకూర్. ks భరత్ , జయాదవ్ ఉనాద్కట్ ఎంట్రీ ఇచ్చారు.
సాహా , ఇషాంత్ శర్మ , హనుమ విహారి లకు టీంలో ఈసారి చోటు దక్కలేదు .
మన ఇండియా బ్యాటింగ్ ఎలా ఉందంటే :
కింగ్ కోహ్లీ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. టీ 20, వన్డే, టెస్ట్, ఐపీల్ అన్నిటిలో కోహ్లీ సెంచరీ తో కంబ్యాక్ ఇచ్చాడు. wtc ఫైనల్లో ఖచ్చితంగా సెంచరీ చేస్తాడని పిస్తుంది. శుబ్మన్ గిల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు గిల్ నుండి కూడా మనం 100 ఆశించ వచ్చు.
ఇక పుజారా ఆల్రెడీ ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతు అద్భుతంగా రాణిస్తున్నాడు. రహానే ఐపీల్ ఫామ్ కొనసాగిస్తే తన నుండి కూడా మంచి స్కోర్ చూడొచ్చు. ఇక్కడ మన ఇండియా లో బాటింగ్ లో మెయిన్ గా రోహిత్ శర్మ ఫామ్ ఒకటి కాస్త ఇబ్బంది కరంగా ఉంది. తను గనక రాణిస్తే మ్యాచ్ మన సైడ్ ఈజీ టర్న్ అవుతుంది.
అల్ రౌండర్స్ విషయానికి వస్తే
అశ్విన్ , జడేజా , అక్సర్ పటేల్ వంటి అల్ రౌండర్స్ బ్యాటింగ్ లోను అటు స్పిన్ లోను బలంగా కనిపిస్తుంది. ఇందులో డౌట్ యే లేదు. ఈ ముగ్గురు ఐపీల్ 2023 లో ఎలా మెరుపులు మెరిపించి వికెట్స్ పడగొట్టారో మనం చూసాం.
ఇక బౌలింగ్ విషయానికి కొస్తే
ప్రస్తుతం పురూపల్ కాప్ హోల్డర్ మహామోద్ సమీ , మొహ్మద్ సిరాజ్ ఇద్దరే కనిపిస్తున్నారు ఫాస్ట్ బౌలర్లు బౌలర్ల కొరత కాస్త కనిపిస్తుంది. ఉమేష్ యాదవ్ ఉన్న ఎంతవరకు రాణిస్తాడో చెప్పలేం. మిగతా ఉనాద్కట్ , శార్దూల ఠాకూర్ కు ఎక్సపీరియన్స్ తక్కువ.
ఇంగ్లాండ్ కండీషన్ వలన ఎవరికీ లాభం :
ఇక పిచ్ విషయానికి వస్తే పిచ్ కూడా ఆస్ట్రేలియాకు అనుకూలం. ఎందుకంటే ఇంగ్లాండ్ కండిషన్స్, ఆస్ట్రేలియా కండిషన్స్ కు దగ్గర గా ఉంటాయి. దానితో పాటు ఆస్ట్రేలియా యాషెస్ లాంటి పెద్ద పెద్ద టెస్ట్ సిరీస్ లు ఆడే అనుభవం ఉంది.
కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది అగ్ని పరీ క్ష అని చెప్పవచ్చు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కోసం ఇండియా డిఫ్రెంట్ ప్లాన్స్ తో వెళ్ళి, ప్లాన్స్ అన్ని కర్రెక్ట్ గా ఎక్సిక్యూట్ చేస్తే ఇండియా కు తిరుగుండదు .
ఓవర్సీస్ లో ఇలాంటి మిక్సడ్ టీంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్లో ఆస్ట్రేలియా వంటి పెద్ద టీం తో గెలవటం అంత ఈజీ కాదు అనే చెప్పా వచ్చు.
ఏది ఏమయినా మన టీం ఇండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్ లీగ్ లో అద్భుతంగా రాణించి ట్రోఫీ తో తిరిగి రావాలని కోరుకుందాం.
జై హింద్ జై భారత్
0 కామెంట్‌లు