Primary Reason for Rcb Failure
ఆర్సీబీ వన్ అఫ్ ది పాపులర్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఇన్ ది వరల్డ్ . ఐపీల్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చే టీమ్స్ చెన్నై, ఆర్సీబీ . ముంబై . కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే చెన్నై,ముంబైకి 4,5 ఐపీల్ ట్రోఫీలు ఉన్నాయ్, కానీ ఆర్సీబీకి టీ కప్పు తప్ప ఎపుడు ఐపీల్ కప్ చూసింది లేదు. అయినా ఐపీల్ లో మోస్ట్ పాపులర్ ఎందుకంటే, ఐపీల్ స్టార్టింగ్ సీజన్ నుండి ఇప్పటి వరకు ఆర్సీబీలో స్టార్ ప్లేయర్లకు కొదవలేదు. విరాట్ కోహ్లీ , ఎబి డివిలియర్స్ , క్రిస్ గైల్ , వాట్సన్ , స్టార్క్, ఆరోన్ ఫించ్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లతో ఆర్సీబీ ఎప్పుడు నిండుగా ఉంటుంది.
మరి ఇలాంటి ఆటగాళ్లు ఉంటున్న ఎక్కడ తప్పు జరుగుతుంది ? ఎందుకు ఆర్సీబీ కప్ కొట్ట లేకపోతోంది?
ఇది తెలుకోబోయే ముందు ఆర్సీబీ ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుకుందాం
మొదటి సీజన్లో రాహుల్ ద్రావిడ్ కెప్టెసి తో మొదలయిన ఆర్సీబీ ప్రస్థానం, ఆతరవాత కెవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే , వెటోరి , విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫాఫ్ డు ఫ్లెసిస్ వంటి స్టార్ ఆటగాళ్లు కెప్టెన్లు గా ఉన్నారు. విరాట్ కోహ్లీ అత్యధిక కాలం ఆర్సీబీ కి కెప్టెన్గా వ్యవహరించాడు.
ఆర్సీబీ ఇప్పటి వరకు 8 సార్లు ప్లేఆఫ్ కి క్వాలిఫై అవ్వగా 3 సార్లు ఫైనల్ ఆడింది. మూడు ఫైనల్స్ లో రెండుసార్లు మన హైదరాబాద్ టీమ్స్ తో, ఒక్కసారి చెన్నై తో ఓటమి పాలయింది.
ఐపీల్ లో ఆర్సీబీ కప్ కొట్టకపోటానికి సరైన నాయకత్వం లేకపోవటమే అని విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్సీబీ కెప్టెన్సీ రికార్డు గురించి మాట్లాడుకుందాం.
2008 లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్గా చేసి ఆతరువాత సీజన్ ద్రావిడ్ ను రాజస్థాన్ కొనుగోలు చేసింది. అనిల్ కుంబ్లే 2009, 2010 సీజన్లో క్యాప్టిన్సి చేసి, 2009 లో ఫైనల్ కి, 2010 లో ప్లే ఆఫ్ కి చేర్చ గలిగినా కప్ తెలీకపోయాడు. ఆ తరవాత డానియల్ వెటోరి నాయకత్వంలో 2011 లో మరో సారి ఫైనల్ చేరుకున్న చెన్నై చేతిలో ఓటమి పాలయింది. 2008 నుండి 2012 వరకు నాలుగు సీజన్లో రెండు సార్లు ఫైనల్కు, ఒకసారి ప్లేఆఫ్ కి చేసుకుంది.
విరాట్ కోహ్లీ ఆగమనం
ఇలా ఆర్సీబీ కి ఐపీల్ కప్ ఊరిస్తున్న సమయంలో 2013 లో పూర్తీ స్థాయిలో ఆర్సీబీ పగ్గాలు విరాట్ కోహ్లీ చేతిలోకి వచ్చాయి. అప్పటికే విరాట్ టీం ఇండియా లోను, ఆర్సీబీ లోను స్టార్ ఆటగాడిగా ఎదిగాడు, రేపో మాపో ఇండియా కు కూడా కెప్టెన్గా అవ్వొచ్చు.
ఇలాంటి సమయంలో విరాట్ ఆర్సీబీ నాయకత్వం బాధ్యతలు తీస్కున్నాడు. ఎప్పుడైతే విరాట్ ఆర్సీబీ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుండి ఆర్సీబీ కి అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు , అయితే విరాట్ కోహ్లీ ఎలగ్హైనా ఐపీల్ కప్ తీసుకొస్తాడు అనే ఆర్సీబీ ఫాన్స్ కు ప్రతి సంవత్సరం నిరాశనే ఎదురయింది.
2013 కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న విరాట్ కోహ్లీ 2021 వరకు మొత్తం 140 మ్యాచ్ లు కెప్టెన్సీ కొనసాగించి, 3 సార్లు ప్లే అఫ్ కి ఒకసారి రన్నర్ అప్ గా వరకు తీసుకెళ్లాడు కానీ ట్రోఫీ ని తెచ్చి పెట్టి లేకపోయాడు.
అసలు ఆర్సీబీ ది దురదృష్టమా ? లేక నాయకత్వ లోపమా ? అసలు కారణం ఏంటి ?
ఆర్సీబీ కి ప్రధాన సమస్య వాళ్ళ మానేజ్మెంట్ . అవును మీరు విన్నది నిజమే ఆర్సీబీ కి మానేజ్మెంట్ యే పెద్ద సమస్య.
RCB ప్రతి సంవత్సరం ఓడిపోతానికి ప్రధాన కారణాలు :
1.
ఐపీల్ మొదలయినపుడు నుండి ఇప్పటి వరకు జట్టు కూర్పులో ఆర్సీబీ యాజమాన్యానికి ఒక స్పష్టత ఉండదు. ఐపీల్ లో విజయవంతం అయినా csk , ముంబై, GT వంటి టీమ్స్ చూస్కుంటే వాటి యాజమాన్యాలు అటు ఆక్షన్లో గాని , లీగ్ లోగాని ప్రొపెర్ ప్లానింగ్ తో ముందుకెళ్తాయి.
2.
కానీ ఆర్సీబీ విషయంలో వారి యాజమాన్యం ద్రుష్టి అంతా స్టార్ ఆటగాళ్లమీదనే పెడ్తుంది. ప్రతి సీజన్లో ఎక్కువ డబ్బులతో స్టార్ ఆటగాళ్ళని కోనేస్తుంది. చివరకు జట్టు కూర్పు విషయానికి వస్తే మంచి అల్రౌండర్లు , బౌలర్లు కొందాం అనేసరికి వీళ్ళదగ్గర బిడ్ చేసే అంట డబ్బు ఉండదు. అంతా ఒకరిద్దరి మీదనే ఇన్వెస్ట్ చేస్తారు.
3.
ఇంత ఇన్వెస్ట్ చేసి వాలాను కొనసాగిస్తారా ....... లేదు. కొన్ని మ్యాచ్లు సరిగా ఆడకపోతే బెంచ్ కె పరిమితం చేస్తారు. నెక్స్ట్ సీజన్లో వదిలేస్తారు. ఉదాహరనుకు చాహల్, kl రాహుల్ , హెట్ మేయర్ , పూరన్ , వాట్సన్ , క్రిస్ గైల్ ఇంకా చాల మందే ఉన్నారు. వీళ్లంతా ఆర్సీబీ నుండి వచ్చిన వాళ్లే . వీలంతా ఆర్సీబీ నుండి బయటకి వచ్చాక బాగా ఆడటం మనం గమనించే ఉంటాం. ఒకటి రెండు మ్యాచ్లు ఫెయిలయ్యాక మల్లి వాళ్ళని కంబ్యాక్ చేస్కునే అవకాశం ఇవ్వదు.
4.
ఆర్సీబీలో పేరుకే 11 మంది ఆటగాళ్లు ఉంటారు. కానీ ఆర్సీబీ ఎప్పుడు ముగ్గురు , నలుగురు ప్లేయర్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఉద హరణకుఇప్పుడు విరాట్ , డుప్లెసిస్ , మాక్స్వెల్ మరియు సిరాజ్ మీదనే ఆధారపడింది. ఒకప్పుడు విరాట్ , డివిల్లీర్స్ , చాహల్ మీదనే భారం అంత . అదే మిగతా సక్సెస్ ఫుల్ టీమ్స్ చూస్కుంటే జట్టు మొత్తం సమిష్ట గా రాణిస్తుంది. this ఐస్ ది మేజర్ మిస్టేక్.
5.
ఆర్సీబీ ని పట్టి పీడిస్తున్న సమస్య బౌలింగ్ ఇప్పటి వరకు ఏ సీజన్లో కూడా అబ్బా ఆర్సీబీ బౌలింగ్ భాగింది అన్న సీజన్ లేదు. అన్ని టీమ్స్ తో పోల్చుకుంటే ఆర్సీబీ బౌలింగ్ ఎకానమీ ఎక్కువగా ఉంటుంది. 200 కంటే ఎక్కువ టార్గెట్ ఇచ్చినా ఆర్సీబీ గెలుస్తుంది అనిఅనుకోలేం. ఎందుకంటే మనోళ్ల పనితనం అలాంటిది. చివరి నాలుగు ఓవర్ లో ఎక్కువ పరుగుల సమర్పించుకున్న టీమ్స్ లో ఆర్సీబీ కచ్చితంగా ఉంటుంది. ఆర్సీబీ స్టార్ బాట్స్మన్ లా మీద పెట్టిన శ్రద్ద బౌలర్ లా మీద కూడా పెడితే ఇక నైనా ఈ సాల కప్ నమదే అవుతుంది.
0 కామెంట్‌లు