RCB Playoffs వెళ్లాలంటే
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో బెంగళూరు బౌలర్లు రఫ్ఫాడించారు. ఎంత స్కోర్ కొట్టినా నిలుపుకోలేని బెంగళూరు నిన్న రాజస్థాన్ తో మాత్రం విజృభించారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాకు తమ పదునైన బంతులతో చుక్కలు చూపించారు. దీంతో కేవలం 59 రన్స్ కె పరిమితం అయ్యింది. లాస్ట్ మ్యాచ్ హీరో జైస్వాల్ తో పాటు , తన సహా ఓపెనర్ బట్లర్ ఇద్దరు డక్అవుట్ అయ్యి వెనుతిరిగారు. రాజస్థాన్ జట్టు బాటింగ్ లైన్ అప్ లో ఒక్క హెట్ మేయర్ తప్ప ఎవరు రాణించలేదు, అందరు సింగల్ డిజిట్ కె అయ్యారు. ఈ మ్యాచ్ లో 112 రన్స్ తేడాతో బారి విజయం సాధించి, తమ ప్లేఆఫ్ ఆసలు సజీవంగా ఉంచుకుంది. ఇంతటి బారి విజయం వలన నెట్ రన్ రేట్ కాస్త నెగటివ్ నుండి పాజిటివ్ కు వచింది. ఇది బెంగళూరు కు బాగా కలిసొచ్చే విషయం.
ఇది ఇలా ఉండగా
ఇంతటి పెద్ద విజయం వచ్చినా కూడా RCB ప్లే ఆఫ్ కి వెళ్ళటం అంత సులువేం కాదు.
ఆర్సీబీ ప్లేఆఫ్ ఆఫ్ కి అర్హత సాదించాలి అంటే క్రింద చెప్పినవి అన్ని జరిగితేనే బెంగళూరు ప్లేఆఫ్ కి క్వాలిఫై అవుతుంది. అవి ఏంటంటే ముందుగా ఆర్సీబీ మిగతా రెండు మ్యాచ్ లు గెలవాలి. ఆతరవాత లక్నోమరియు పంజాబ్ లు తమ మిగతా రెండు మ్యాచ్ల్లో ఎదో ఒక మ్యాచ్ ఓడితేనే rcb ప్లే ఆఫ్ కి వెళ్తుంది, లేకపోతె నెక్స్ట్ సాల కప్ నామదే అవుతుంది.
ఐపీల్ అనగానే ముందుగా ఆర్సీబీ గురుస్తోంది. ఈ జట్టు ఒక్కసారి కూడా కప్పు కొట్టక పోయిన ఎప్పుడు గొప్ప అంచనాలతో బరిలోకి దిగుతుంది. ఈ జట్టులో ఎప్పుడు కూడా స్టార్ ప్లేయర్స్ కి కొదవుండదు. కానీ ఎప్పుడు ఎదో ఒకటి లోటు ఉంటుంది. కెప్టెన్లు మారినా , బౌలర్లు మారిన ఆర్సీబీ కి కప్ మాత్రం రావటంలేదు. కప్ మాట పక్కన పెడితే ప్లేఆఫ్ కి వెళ్లటానికె నానా తిప్పలు పడుతుంది. చూడాలి మరి ఆర్సీబీ ఇవ్వన్ని దాటుకొని వెళ్లి ప్లే ఆఫ్ కి వెళ్లి కప్ కొడుతుందో లేదో.
0 కామెంట్‌లు