శుబ్మాన్ గిల్ మరో విరాట్ కోహ్లీ లా మారనున్నాడా
శుబ్మన్ గిల్ ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు, ఇక ముందట కూడా గట్టిగా విన్పించబోయే పేరు అవుతుంది. ఎందుకంటే గిల్ ఈ 2023 లో సాధించిన ఘనతలు అలాంటివి.
గిల్ కు 2023 ఒక మరుపురాని సంవత్సరం గా మారిపోయింది.
ఈ ఆరు నెలల్లోనే తన కెరీర్ లో ఎన్నో మర్చిపోలేని ఇన్నింగ్స్ లు ఆడాడు. గిల్ ఈ ఒక్క 2023 లో వన్డేలో డబల్ సెంచరీ తో పాటు రెండు సెంచరీలు, 2023 జనవరి లో టీ 20 లో డెబ్యూ చేసి సెంచరీ, టెస్టులో రెండు సెంచరీలు చేసాడు.
ఐపీల్ 2023 లో 60 అవేరేజ్ తో 157 స్త్రీకేరట్ తో 890 రన్స్ చేసి ఆరంజ్ కాప్ అందుకున్నాడు. ఒకే సీజన్లో లో ఎక్కువ రన్స్ చేసిన ఆటగాల్లో రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో కింగ్ కోహ్లీ ఉన్నాడు.
ఇంకా ఈ ఐపీల్ 2023 గిల్ సాధించిన రికార్డ్స్ చుస్తే
*ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు (129) సాధించిన ఇండియన్ బ్యాటర్ మరియు
*ప్లేఆఫ్స్ అత్యధిక సిక్సులు(10)
*ప్లేఆప్స్ లో అత్యధిక స్కోరు(129)
*ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక బౌండరీలు (111) బాదిన (సిక్సులు, ఫోర్లు) రెండో ఇండియన్ బ్యాటర్.
ఇవన్నీ చూస్తుంటే గిల్ మరో విరాట్ లా కనిపిస్తున్నాడా ? లేదా అంతకు మించి సాధిస్తాడు అనిపిస్తుందా ? ఇదే స్థాయి లో ఆడితే గిల్ కచ్చితంగా విరాట్ కోహ్లీ రేంజ్ కి వెళ్లగలడు.
సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యే టైంకి విరాట్ కోహ్లీ, ఇదే రేంజ్ లో అదరగొట్టే వాడు. ఇప్పుడు విరాట్ తరవాత ఎవరు అంటే, గిల్ అని సందేహం లేకుండా చెప్పేలా అదరగొడుతున్నాడు గిల్.
ఇది ఆరంభం మాత్రమే అసలు కథ ముందుంది
ఈ ఏడాది లో జరగబోయే వరల్డ్ కప్, ఆసియ కప్ తో పాటు WTC ఫైనల్లో గిల్ ఇదే ఫామ్ కనపరిస్తే మన టీమిండియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తుంది. . 2011 తరవాత మరల ఇండియాలో జరుగుతున్నా వరల్డ్ కప్లో టీమిండియా ఎలాగయినా గెలవాలి అనే పట్టు దలతో ఉంది.
వరల్డ్ కప్ తో పాటు రానున్న ఆసియ కప్ , WTC ఫైనల్ వంటివి ఐసీసీ పెద్ద ఈవెంట్స్ ఇలాంటి పెద్ద టోర్నమెంట్ లో గిల్ ఇదే విధంగా ఆడితే ఇండియాకు మరో సచిన్, విరాట్ దొరికినట్టే.
0 కామెంట్‌లు