IPL Fixing .....?? అసలు నిజం ఏంటంటే
ఐపీల్ మొత్తం ఫిక్సింగేనా.... టైటిల్ ఎవరు గెలుస్తారో ముందే ఫిక్స్ అయిపోతుందా ....
అంటే ఫైనల్ బాల్ వరకు వచ్చి టెన్షన్ పెట్టడం, ఓడిపోతుంది అన్న టీం గెలవటం ఇవన్నీ స్క్రిప్టేన ..
ఇలా ఎప్పుడైనా అనిపించిందా మీకు ? అనిపించక పోయిన మన చుట్టూ ఉండేవాళ్లు లో ఎవరో ఒకరు ఇలా అనే ఉంటారు.
అసలు దీనిలో నిజం ఎంత ?
ఐపీల్ ఫిక్సింగ్ అని ఎందుకు అనిపిస్తుంది ? వరల్డ్ నెంబర్ వన్ టీ 20 లీగ్ అయినా ఐపీల్ మీద ఫిక్సింగ్ ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? ఇలా రావడం వెనుకున్నది ఎవరు?
అసలు నిజం ఏంటంటే
ఐపీల్ లో అసాధ్యం అనుకున్నవి కూడా సాధ్యం అవుతాయి. ఐపీల్ ని ప్రెడిక్ట్ చేయడం చాల కష్టంగా ఉంటుంది. గెలుస్తుంది అనుకున్న టీం ఓడిపోవటం, ఓడిపోతుంది అనుకున్న టీం గెలవటం. బలమైన టీం అనుకున్నవి కూడా గోరంగా, బలహీనమైన టీమ్స్ మీద ఓడిపోతుంటాయి.
అసలు ఫిక్సింగ్ ఆరోపణ కి ఊపిరి పోసేది ఏది అంటే strategic timeout. ఈ strategic timeout తరవాత మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. అప్పటి వరకు బాగా ఆడిన టీం ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది. స్లో ఆడుతున్న టీం విజృభిస్తుంది. ఎందుకిలా ?
Strategic timeout లో ఎం జరుగుతుంది?
ఒక్క మ్యాచ్ మధ్యలో 4 సార్లు 2 నిమిషాల 30 సెకన్ల పాటు strategic timeout బ్రేక్ వస్తుంది. రెండు బౌలింగ్ timeouts, రెండు బాటింగ్ timeouts. ఈ సమయంలో ఆ జట్టు కెప్టెన్లు మరియు జట్టు యొక్క ప్రధాన కోచ్ లు మ్యాచ్ పరిస్థితి ని బట్టి వ్యూహాలు, ప్లాన్స్ వేసుకుంటారు.
బౌలింగ్ టైం అవుట్ లో ఏ బ్యాట్సమన్లను ఎలా ఆపాలి, ఎలాంటి ఫీల్డింగ్ పెట్టాలి అని, బ్యాటింగ్ timeout లో ఏ బౌలర్ ని టార్గెట్ చెయ్యాలి. ఎలా రన్స్ రాబట్టాలి అని ప్లాన్స్ వేసుకుంటారు. ఈ ప్లాన్స్ తగ్గట్టు ప్లేయర్స్ ఆడుతారు. దాని ఫలితంగా మ్యాచ్ స్వరూపాలు మారుతుంటాయి.
ఇలా మ్యాచ్ ఒక్కసారిగా మారిపోవటం, గెలుస్తుంది అన్న తమ టీం ఓడిపోవటం వలన అభిమానులు నిరాశ గురై, పక్కన ఉన్న ఫ్రెండ్స్ తో అరే మ్యాచ్ కన్ఫర్మ్ ఫిక్సింగ్ రా ? అని ఒకడు, కావాలనే ఓడిపోయారు అని ఒకడు. ఇంకా బెట్టింగ్ రాయళ్ళు అయితే మరీనూ , గెలుస్తుంది అని ఒక టీం మీద బాగా డబ్బులు పెట్టివుంటారు , ఆ టీం గెలిచినట్టే గెలిచి ఓడిపోతే, డబ్బుపోయిన బాధలో ఆ ఫ్రాస్ట్రేషన్ ఎవరిమీద చూపించాలో తెలియక, ఐపీల్ వేస్ట్ రా పక్క స్క్రిప్టెడ్ రా లేకపోతె ఆ స్కోర్ కొట్టలేక పోవటమా అంటూ , సోషల్ మీడియాలో ఫిక్సింగ్ అని పోస్ట్ పెట్టి, మళ్ళి తర్వాత మ్యాచ్ ఎవరి మీద బెట్టింగ్ చేద్దామా అని మల్లి బిజీ అయిపోతాడు.
వీటితో పాటు చిన్న చిన్న ఎంపీరింగ్ తప్పిదాలు, కీలకమైన సమయళ్ళలో అంపైర్లు చిన్న తప్పిదాలు చేస్తారు. ఈ తప్పిదాలే ఒక్కోసారి మ్యాచ్ ఫలితం మార్చే వచ్చు. అప్పుడు ఫాన్స్ అంపైర్లు అమ్ముడు పోయారని, పలానా టీం ఎంపైర్లను కొనేసింది సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వగానే, మన ఇండియన్ మీడియా ఊరుకుంటుందా దీని మీద డిబేట్స్మీద డిబేట్స్ పెట్టి ఎం లేకపోయినా ఎదో ఉన్నటు చూపిస్తుంది.
అయితే ఇవన్నీ మన దేశ అంతర్గత విషయాలు
ఇవన్నీ కాష్ చేసుకోటానికి, ఇండియా ఎప్పుడు దొరుకుతుందా ట్రోల్ చేద్దామా అని చూస్తుంటారు మన పొరుగున ఉన్న పాకిస్తానీ గుంటనక్కలు. అసలే వాళ్లకి ఐపీల్ లో ప్లేస్ లేదు, వచ్చినా రానిచ్చేది లేదు. ఐపీల్ లో ఎలాగో ఆడనియ్యం అని వాళ్ళు ఎదో చిన్న టీ 20 లీగ్ పెట్టుకున్నారు, దానికి ఐపీల్ రేంజ్ లేదు. ఐపీల్ ఆడలేక, ఐపీల్ తో పోటీ పడలేక, ఐపీల్ మీద ఎప్పుడు నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలంటి వాళ్లకి ఈ ఫిక్సింగ్ అనే మాటని ఆయుధం లా దొరికింది. ఐపీల్ ఆదరణ చూడలేక ఈ ఫిక్సింగ్ అనే మాటని ఉపయోగించి రకరకాలు పాకిస్తాన్ ఐపీల్ మీద తప్పుడు ప్రచారం చేస్తుంది.
అటు పాకిస్తాన్, ఇక్కడ మన దేశంలో లోనే కొందరు ఐపీల్ గురించి పూర్తిగా తెలియకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇవేమి ఐపీల్ క్రేజ్ ని కొంచెం కూడా తగ్గియలేవు.
అసలు విషయం ఏంటంటే, ఐపీల్ ఫిక్సింగ్ అయ్యే ఆస్కారమే లేదు.
ఎందుకంటే ఐపీల్ అనేది దేశవాళీ టోర్నమెంట్ కాదు, ప్రపంచం మొత్తం చూస్తున్న నెంబర్ వన్ టీ20 లీగ్. ఇందులో పాకిస్తాన్ తప్ప మిగతా అన్ని దేశాల క్రికెటర్స్ ఆడుతుంటారు,ఆడాలనుకుంటారు. ఫిక్సింగ్ అయితే ఎందుకు ఆడాలనుకుంటారు.
ఐపీల్ వల్లనే ఎంతో మంది క్రికెటర్స్ ఇండియన్ టీంలోకి వచ్చి సత్తా చాటారు. ఐపీల్ మన దేశ క్రికెట్ భావితరాలు తయారుచేస్తుంది. ఐపీల్ ఫిక్సింగ్ అయితే మన ఇండియన్ క్రికెట్ కు భవిషత్ ఉండదు. ఏ దేశం కూడా దేశ భవిషత్ తో ఆటలాడదు.
ఐపీల్ లో ధోని, విరాట్ , రోహిత్ వంటి ఆటగాళ్లుగా మరియు సచిన్ , పాయింటింగ్ , లారా , సంగక్కర , గంగూలీ వంటి గ్రేట్ లెజెండరీ ఆటగాళ్లు మెంటర్లు ,కోచ్ లు గ ఉన్నారు. ఐపీల్ అనేది ఫిక్సింగ్ అయితే వీలందరు ఫిక్సింగ్ చేసినట్టే . వీళ్లకి డబ్బుకు, ఫేమ్ కు ఎం కొదవలేదు. వీళ్ళు ఎవరు ఆలా చేసే ప్రసక్తే లేదు. వీళ్లకి తెలియకుండా ఐపీల్ లో ఎం జరగదు.అలాంటిది ఏదయినా ఉంటె వీళ్లు ఐపీల్ కోసం ఇంతలా కష్టపడరు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే
ఐపీల్ ను ఇండియన్ గవర్నమెంట్, పోలీస్ వ్వవస్థ తో పాటు ప్రపంచ లో ఉన్న పలు ఇంటెలీజెన్సిస్ ఎప్పుడు మూడో కన్నులా చూస్తూ ఉంటాయి. ఎక్కడ ఎటువంటి చిన్న తప్పు కూడా జరగకుండా పర్యవేక్షిస్తూ ఉంటాయ. ఒకవేళ ఏదయినా చిన్న తప్పు జరిగిన వెంటనే బయటకొస్తుంది.
ఐపీల్ ఫిక్సింగ్ అనుకుంటే, ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా మొత్తం ఫిక్సింగ్ అని అర్ధం. ఇప్పడికయినా భ్రమ నుండి బయటకి వచ్చి వాస్తవాలను అర్ధం చేసుకోవాలి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం సులువు కానీ దాన్ని నిజం అని నిరూపించలేం. ఐపీల్ ఒక గొప్ప క్రికెట్ లీగ్ అలాంటి మన దేశం నిర్వహిస్తున్నందుకు గర్వపడాలి. జై హింద్ జై భారత్.
బ్రో నువ్వు బాగానే చెప్తున్నావ్ ఫిక్సింగ్ లేదని మరి లేకపోతె చెన్నై , రాజస్థాన్ ఫ్రాంచైజీలు 2 సంవత్సరాలు ఎందుకు బ్యాన్ చేసారు అనొచ్చు. దీని గురించి నెక్స్ట్ వీడియో లో తెలుసుకుందాం. ముందు భారత్ స్పోర్ట్స్ ని సబ్స్క్రయిబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
0 కామెంట్‌లు